Inspire Manak Online Registration & Nominations

DEPARTMENT OF SCHOOL EDUCATION
 KRISHNA DISTRICT.
MANAK (INSPIRE AWARDS) SCHEME, 2018-19

Inspire MANAK Online రిజిస్ట్రేషన్  & నామినేషన్స్ లో  
విద్యార్థుల రిజిస్ట్రేషన్ మరియు  నామినేషన్స్ కొరకు ప్రధానోపాధ్యాయులకు సూచనలు


  1. కృష్ణా జిల్లా లోని ఏ ఒక్క పాఠశాల Inspire Manak నామినేషన్స్ పంపకుండా ఉండేందుకు మినహాయింపు లేదని గుర్తింఛి, ప్రతి పాఠశాల తప్పనిసరిగా Inspire MANAK Online రిజిస్ట్రేషన్  & నామినేషన్స్ చేయవలెను. 
  2. ప్రభుత్వ ప్రాధమికొన్నత, ఉన్నత పాఠశాలల, ప్రైవేట్, ఎయిడెడ్,  రెసిడెన్షియల్, ఆదర్శ, కస్తూరిభా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు తెలియ జేయునది, Insipre manak online రిజిస్ట్రేషన్, మరియు విద్యార్థుల నామినషన్స్ పూర్తి చేయవలసినదిగా మనవి. 
  3. Inspire MANAK Online Nominations  లో రిజిస్ట్రేషన్ చేయని ఉన్నత పాఠశాలల  పదవ తరగతి నామినల్ రోల్స్ తీసికొనబడవు.
  4. చివరి తేది:సమయం ఉందని వేచి చూడక గడువులోపు విద్యార్థుల ప్రాజెక్ట్ వివరాలు నమోదు చేయాలి. దాదాపు అన్ని స్కూల్స్ రిజిస్ట్రేషన్ చేయబడే వున్నవి,inspire home page లోని downloads లోకి వెళ్లి application number ద్వారా వివరాలు పొంద వచ్చును, OTR తప్పనిసరి అయితే దానిని పూర్తిచేసి, నామినషన్స్ ను పంపాలి.

Online registration చేయునపుడు (Schools Registring for first time)



  1. మీ పాఠశాల dise నంబర్, mail ( personal id లు కాకుండా పాఠశాల పేరుతో ఐడి create చేస్తే మంచిది)  మొత్తం విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, సైన్స్ ఉపాధ్యాయుల సంఖ్య, ప్రధానోపాధ్యాయుని పేరు, సెల్ నంబర్, inspire కు ఇన్చార్జ్ ఉపాధ్యాయుని పేరు, తన సెల్ నంబర్, పాఠశాల అడ్రస్ వివరాలు కలిగి ఉన్నట్లైతే 5 ని''లలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
  2. వన్ టైం రిజిస్ట్రేషన్ చేయు విధానం www.inspireawards-dst.gov.in అడ్రస్ ద్వార web పేజీ ఓపెన్ చేసినపుడు దానిలో school authority ని క్లిక్ చేసినపుడు onetime registration వచ్చును. దానిని క్లిక్ చేసిన online mode అని వచ్చును. దానిని క్లిక్ చేసిన new school registration form  వచ్చును. దానిలో మీ పాఠశాల mail, మరియు dise నెంబర్, రెవిన్యూ జిల్లా  KRISHNA  గాను, ఇలా పైన చెప్పిన వివరాలు కూడా నమోదు చేసిన తరువాత save&next నొక్కిన తరువాత Forward for Approval అని District authority కి forward చేస్తే పాఠశాల registration process successful అంటూ ఒక application Id వస్తుంది. ఆ తరువాత Generate Acknowledgement create చేస్తే సరిపోతుంది.
  3. Acknowledgement save  and print తీసుకొని స్కూల్ రికార్డు  లో భద్రపరుచుకోవాలి.
  4. District authority approved అయ్యాక mail Id కి మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ లింకు ద్వార మన పాఠశాల user Id మరియు password create చేసుకొవలెను.
  5. నామినషన్స్ చేయు విధానము: లాగిన్ అయి హైస్కూల్ అయితే 6 నుండి 10 వరకు 5గురువిద్యార్థుల, ప్రాధమికొన్నత అయితే ఇద్దరు విద్యార్థుల పేర్లు, తండ్రి పేర్లు, పుట్టినతేది, ఆధార్ నంబర్లు మొదలగు సమాచారం forward నామినేషన్స్ లో చేయవలెను. విద్యార్థుల ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి సమాచారమును మరియు ప్రాజెక్ట్ writeup ను, బ్యాంకు details ను upload చేసి ప్రక్రియను పూర్తి చేయవలెను. 
  6. గత సంవత్సరం OTR పూర్తి చేసుకొని user Id, password గుర్తు ఉన్నవారు నేరుగా నామినషన్స్ చేయవచ్చు.
  7. User Id గుర్తుకు లేనివారు, స్కూల్ లిస్టులో స్కూల్ పేరు లేని వారు others అనే ఆప్షన్ ద్వార మరల OTR చేయవచ్చు
  8. విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులకు మక్కువ పెంచే విధంగా సృజనాత్మకంగా, నూతనత్వంతో కూడిన, పర్యావరణ హితంగా నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే విధంగా విద్యార్థులకు ప్రాజెక్టు ల రూపకల్పనలో మార్గనిర్ధేశం చేయాలి
  9. ఈ దిశలో ప్రోత్సహిస్తూ వచ్చిన Inspire manak అవార్డ్స్ లో OTR, నామినషన్స్ ను విజయవంతంగా ప్రతి పాఠశాల పూర్తి చేయాలి. విద్యార్థుల వివరాలు ప్రాజెక్ట్ writeup లను సిద్ధం చేసుకుని ప్రక్రియ ప్రారంభిస్తే మంచిది.

Inspire Awards Manak Online Nomination

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top