తిభా అవార్డుల నగదు పురస్కారాల కోసం 26లోగా ఖాతా వివరాలు నమోదు చేయండి : పాఠశాల విద్యాశాఖ కమీషనర్ కె.సంధ్యారాణి
★ ఇబ్రహీంపట్నంః విద్యార్థులను మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రవేశ పెట్టిన ప్రతిభా అవార్డుల నగదు పురస్కారానికి సంబంధించి విద్యార్థులు తమ బ్యాంకు ఖాతాల వివరాలను డిసెంబర్ 26 లోగా నమోదు చేసుకోవాలని పాఠశాల విద్యా కమీషనర్ కె.సంధ్యారాణి వెల్లడి.
★ 2017-18 విద్యా సంవత్సరంలో ప్రతిభా అవార్డులు పొందిన విద్యార్థులు సీఎస్ఈ.ఎపి. జీవోవీ.ఇన్ లోకి వెళ్లి వివరాలు నమోదు చేయాలని సూచన.
★ ఈ మేరకు కమీషనర్ బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
★ 2017-18 విద్యా సం.లో 4007 మంది విద్యార్థులు ఎస్.ఎస్.సి మెరిటోరియస్ లో ప్రతిభా అవార్డులు పొందారని, వీరిలో 2182 మంది విద్యార్థుల మాత్రమే తమ బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలు నమోదు చేసుకొన్నారని వెల్లడి.
★ ఇంకా 1825 విద్యార్థులు తమ బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలను నమోదు చేయలేదని తెలిపారు.
★ ప్రతిభా అవార్డు నగదు ప్రోత్సాహం కింద రూ .20,000 నగదు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు.
★ వెంటనే అవార్డు గ్రహీతలు తమ బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలను వెబ్ సైట్ లో నమోదు చేయాలని పాఠశాల విద్యా కమీషనర్ స్పష్టం చేశారు.
★ ప్రతిభా అవార్డు గ్రహీతల మొబైళ్లకు కూడా ఈ విషయంపై సంక్షిప్త సందేశాలు (SMS) పంపామని కమీషనర్ వెల్లడి.
0 comments:
Post a Comment