Free Gurukula Telugu app

గురుకుల విద్య(విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య) ఇప్పుడు అరచేతిలో ఇమిడిపోయే ఫోన్ ద్వారా ఉచితంగా పొందవచ్చు.

ఈరోజున  కుటుంబాలు చిన్నవి కావటం, పెద్దవారు ఎక్కడో ఉంటున్నారు, పిల్లలు ఉద్యోగరీత్యా, చదువు రీత్యా, కుటుంబ కలహాల రీత్యా విడిగా, దూరంగా వుంటున్నారు. అలాగే చదివే విద్యలో వృత్తికి సంబందించినదే కాని, మనస్సుకు సంబందించినది ఒక్క పుస్తకం కుడా  పాఠాలలో లేదు.అంటే మనం చదువుతున్న చదువులో, విధానం లో ఏదో లోపం ఉంది, ఎందుకంటే సరాసరి ఒక వ్యక్తి 16 సంవత్సరాలు విద్య అబ్యసిస్తాడు, అంటే ఈ 16 సంవత్సరాలలో ఒక్క పుస్తకం కూడా మనస్సుకు సంబందించినది లేకపోవడం విచారకరం. అంతేగాక ఏ పనైనా చేయాలంటే, సాదించాలంటే మనస్సు మాత్రం కావాలి. మరి మనస్సుకు జ్ఞానాన్ని చెప్పే గురుకులాలు కనుమరుగయ్యాయి.కావున విలువలు, నైపుణ్యాలు నేర్పించే గురుకులాలు అవసరం అయినాయి. ‌ఇప్పటి విద్యావిధానం లో విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య కొరవడింది. అది ఉద్యోగం చేయడానికి కావలిసిన నైపుణ్యాలు కావచ్చు, జీవితానికి సంబంధించినవి కావచ్చు. జీవితానికి, ఉద్యోగానికి కావలిసిన విలువలు, నైపుణ్యాల సమస్యను పరిష్కరించటంలో భాగంగా ఈ ఫౌండేషన్ ఏర్పాటు అయినది.

మన లక్ష్యం:  విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య అందరికి ఉచితంగా + సులభంగా అందుబాటులో + ఆకర్షణీయంగా + నాణ్యతతో కూడి అందరికి అందింపబడాలి.

ఈ ఆప్ ద్వారా అందివ్వబడే ఉచిత సేవలు:
సేవ 1)  ఉచిత తెలుగు పుస్తకాలు(3444 pdf పుస్తకాలు) (Free Telugu Books)
సేవ 2)  వీడియో ప్రవచనాలు (Video Pravachanamas)
సేవ 3)  ఆడియో ప్రవచనాలు (Audio Pravachanamas)
సేవ 4)  మైండ్ మేనేజ్‌మెంట్‌ (Mind Management)
సేవ 5)  పిల్లలు (Children/Kids)
సేవ 6)  సామాజిక అవగాహన (Social Awareness)
సేవ 7) ఇంపాక్ట్ - వ్యక్తిత్వ వికాసం ( IMPACT-Personality Development )
సేవ 8) ప్రతిరోజు మంచి వార్తలు ( Daily Good News)

ఈ ఆప్ ముఖ్య విశేషాలు:
1)  పూర్తిగా తెలుగు భాషలో  మాత్రమే అందించటం
2)  పూర్తిగా ఉచితం
3)  సులభంగా   వెతకవచ్చు.
4)  Top Downloads, Top Shared చేసినవి సులభంగా తెలుసుకోవచ్చు.
5)  Ads గాని, వ్యాపార ప్రకటనలు కాని లేవు, అలాగే రిజిస్ట్రేషన్ గాని అవసరం లేదు.
6)  సులభంగా ఇతరులతో షేర్ చేసుకోవచ్చు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top