ప్రతి కుటుంబానికీ హెల్త్‌ కార్డ్‌

★ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కొత్త హెల్త్‌ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశం.

★ క్యూఆర్‌ కోడ్‌తో ఉండే ఈ కార్డులను డిసెంబరు 21 నుంచి జారీ చేయాలని నిర్దేశించారు.

★ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖపై  నిర్వహించిన సమీక్ష సందర్భంగా జగన్‌ ఈ ఆదేశాలు జారీ.

★ ప్రభుత్వం ఇచ్చే కార్డు స్కాన్‌ చేయగానే ఆ కార్డుదారుకి ఓటీపీ నంబర్‌ వచ్చే విధంగా ఏర్పాటుచేయాలి’’ అంటూ కొత్త కార్డు రూపురేఖలను గురించి వివరించారు.

★ ఆరోగ్యశ్రీని శక్తివంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని జగన్‌ ఆదేశించారు.

★ ‘‘రూ. ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలి.

★ ఈ పథకం సుమారు కోటిన్నర మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా.

★ ఆరోగ్యశ్రీలో కొత్తగా చేర్చాల్సిన వ్యాధుల జాబితాను తయారుచేయాలి.

★ రెండు వేలకు పైగా శస్త్ర చికిత్సలను ఈ పథకం కిందకు తీసుకురావాలి’’ అని నిర్దేశించారు.

★ రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించే కార్యక్రమాన్ని జనవరి 1 నుంచి ప్రారంభిస్తామని, పైలట్‌గా తొలుత పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేస్తామని సీఎంకు అధికారులు వివరణ.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top