Gramasachivalayam Jobs ప్రాధమికంగా ఎంపిక చేసిన అభ్యర్ధులకు సూచన

జిల్లా సెలక్షన్ కమిటీ ప్రాధమికంగా ఎంపిక చేసిన అభ్యర్ధులకు సూచన
గ్రామ సచివాలయ పోటీ పరిక్షలో నిర్ణీత మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్ధుల జాబితా నుండి వారి యొక్క రాంక్, లోకల్/ నాన్ లోకల్, పొస్ట్ ప్రాధాన్యత, మహిళా రిజర్వేషన్, సామాజిక వర్గం, వైకల్యం, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు స్పోర్ట్స్ కోటా ల ఆధారంగా జిల్లా కలక్టరు నేతృత్వం లోని జిల్లా సెలక్షన్ కమిటీ పరిశీలన చేసిన అనంతరం ప్రాధమికంగా ఎంపిక అయిన వారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కొరకు నిర్ణీత ప్రదేశంలో హాజరు కావలసిందిగా ఎస్.ఎం.ఎస్ మరియు ఇ మెయిల్స్ ద్వారా అభ్యర్ధులకు సమాచారము పంపట మైనది.

గ్రామ సచివాలయం వెబ్ సైట్ నుండి అభ్యర్ధులు తమ హాల్ టికెట్ నంబరు మరియు పుట్టిన తేది ఆధారంగా కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకొనవచ్చు. కాల్ లెటర్ పొందిన అభ్యర్ధులు తమ దరఖాస్తు ఫారం, 4 నుండి 10వ తరగతుల స్టడీ సర్టిఫికెట్స్, విద్యార్హతలు, కులం, స్పోర్ట్స్ / వికలాంగత్వం/ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్స్, యాంటిసిడెంట్ ఫారం మరియు తదితర సర్టిఫికెట్స్ ను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసుకోవలెను. ఆ విధంగా అప్ లోడ్ చేసిన సర్టిఫికెట్స్ ను మరల వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, వాటిని ప్రింట్ చేసుకొని, వెరిఫికేషన్ సమయంలో అధికారులకు రెండు ప్రతులు అందచేయవలెను.

Selected Candidates for verification

Download Call letters

Upload Certificates

Anticidents verification form

Download upload Certificates
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top