How to Use Two Whatsapp Accounts in Single Phone

ఒకే ఫోన్ లో రెండు Whatsappలు ఉపయోగించాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి!

మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయితే..

▪కొన్ని కంపెనీల ఫోన్లలో డ్యూయల్ యాప్స్ ఉపయోగించేందుకు ప్రత్యేకమైన ఆప్షన్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించడం ద్వారా ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ ఖాతాలు ఉపయోగించవచ్చు. షావోమి ఫోన్లలో అయితే ‘Dual apps’, శాంసంగ్ లో ‘Dual Messenger’, ఒప్పోలో ‘Clone apps’, వివోలో ‘App Clone’, అసుస్ లో ‘Twin apps’, హువావే, హానర్ ఫోన్లలో అయితే ‘App twin’ ఫీచర్లను ఉపయోగించి రెండో వాట్సాప్ ఖాతాను ఉపయోగించవచ్చు.

పైన పేర్కొన్న ఫోన్లలో రెండో వాట్సాప్ ఖాతాను ఉపయోగించాలంటే..

ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.

▪అనంతరం పైన ఉన్న ఫోన్లలో మీ ఫోన్ కు సంబంధించిన ఫీచర్ ను ఓపెన్ చేయాలి.

▪అక్కడ మీకు కనిపించే యాప్స్ జాబితాలో వాట్సాప్ ను ఎంచుకుని దాన్ని ఎనేబుల్ చేయాలి.

▪ఆ ప్రక్రియ పూర్తవగానే మీ హోం స్క్రీన్ ఓపెన్ చేస్తే, మీరు ఉపయోగించే వాట్సాప్ యాప్ పక్కనే మరో వాట్సాప్ లోగో కనిపిస్తుంది.

▪దాన్ని ఓపెన్ చేసుకుని దాని ద్వారా మీరు ఏ నంబర్ తో అయితే రెండో వాట్సాప్ ఖాతాను ఉపయోగించాలనుకుంటున్నారో దానితో ఉపయోగించుకోవచ్చు.

▪ఒకవేళ మీరు పైన పేర్కొన్న ఫోన్లు కాకుండా వేరే ఫోన్లు ఉపయోగిస్తున్నట్లయితే, ప్లేస్టోర్ లో లభించే Parellel space, Dual App Wizard, Double App వంటి యాప్ ల ద్వారా మీ యాప్ ను క్లోన్ చేసుకుని రెండో వాట్సాప్ ఖాతాను ఉపయోగించవచ్చు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top