అమరావతి: ఖాళీగా ఉన్న మరో 19,170 వార్డు వాలంటీర్ల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో మొత్తం వార్డు వాలంటీర్లు 70,888 మంది కాగా... వివిధ కారణాలతో ఉద్యోగం చేరని, తప్పుకున్న వాలంటీర్లు 19,170 మంది ఉన్నారు. ప్రస్తుతం 51,718మంది వార్డు వాలంటీర్లు పనిచేస్తున్నారు. దీంతో మిగిలిన పోస్టుల భర్తీకి పురపాలక శాఖ ప్రభుత్వం అనుమతిని కోరింది. వార్డు వాలంటీర్ల నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో త్వరలో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Download copy
నియామక పరీక్షల నిర్వహణ మరింత పారదర్శకంగా..
ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామక పరీక్షలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శిని ఆదేశించింది. రాత పరీక్షల నిర్వహణ కోసం జాతీయస్థాయి సంస్థల సహకారం తీసుకోవాలని ప్రభుత్వం సూచించిందిDownload copy


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment