నెలకు రూ.210తో రూ.8.5 లక్షలు

కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పెన్షన్ స్కీమ్స్‌ను అందిస్తోంది. వీటిల్లో ఇన్వెస్ట్ చేడయం వల్ల రిటైర్మెంట్ తర్వాత ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేకుండానే జీవించొచ్చు. కేంద్రం అందిస్తున్న స్కీమ్స్‌లో అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) కూడా ఒకటి.అసంఘటిత రంగంలోని కార్మికుల ఆర్థిక భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది.

▪ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు కనీసం రూ.1,000 పెన్షన్ పొందొచ్చు.

▪గరిష్టంగా రూ.5,000 వరకు పింఛన్ లభిస్తుంది. మీరు చెల్లించే మొత్తం ప్రాతిపదికన తీసుకునే పెన్షన్ మారుతుంది.

▪ఏపీవై స్కీమ్‌లో నెలకు రూ.42 చెల్లిస్తే రూ.1,000 పెన్షన్ తీసుకోవచ్చు.

▪అదే నెలకు రూ.210 చెల్లిస్తే అప్పుడు సంవత్సరానికి రూ.60,000 పెన్షన్ తీసుకోవచ్చు.

▪నెలకు రూ.210 చెల్లిస్తూ వెలితే 42 ఏళ్లలో మీ పెన్షన్ కార్పస్ ఏకంగా రూ.8.5 లక్షలు అవుతుంది.

▪నెలకు రూ.42 చెల్లిస్తే అప్పుడు నామినీకి రూ.1.7 లక్షల పెన్షన్ కార్పస్ లభిస్తుంది.

▪నెలకు రూ.84 చెల్లిస్తే కార్పస్ రూ.3.4 లక్షలు, నెలకు రూ.168 చెల్లిస్తే రూ.6.8 లక్షల కార్పస్ లభిస్తుంది. 18 ఏళ్ల నుంచి ప్రతి నెలా ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

▪60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా పెన్షన్ మొత్తం వస్తుంది.

 ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చెల్లించే మొత్తానికి సమానమైన డబ్బులను జమచేస్తుంది. 2015 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో చేరిన వారికే ఈ ప్రయోజనం లభిస్తుంది. ఐదేళ్లపాటు ప్రభుత్వ కంట్రిబ్యూషన్ కొనసాగుతుంది.ఈ స్కీమ్‌లో వీలైనంత త్వరగా చేరడం మంచిది.

35 ఏళ్ల వయసులో ఈ స్కీమ్‌లో చేరితే.. రూ.5,000 పెన్షన్ ఆశిస్తే.. అప్పుడు మీరు ప్రతి ఆరు నెలలకు రూ.5,323 చెల్లిస్తే సరిపోతుంది. ఇలా 25 ఏళ్లు చెల్లించాలి.

ఇలాచేస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ.2.66 లక్షలు అవుతుంది. నెలకు రూ.5,000 పెన్షన్ తీసుకోవచ్చు. అదే మీరు 18 ఏళ్లలోనే చేరితే మీ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.1.04 లక్షలు అవుతుంది. ఇప్పుడు కూడా రూ.5,000 పెన్షన్ పొందొచ్చు. ఆలస్యంగా పథకంలో చేరితే రూ.1.6 లక్షలు నష్టపోతున్నాం

TabelDownload Application
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Income Tax Details and SoftwareCheck Jagananna Ammavodi Payment StatusSubscribe My Whatsapp & Telegram Groups YSR రైతు భరోసా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోగలరు More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top