స్పందన కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు

స్పందన కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు

★ స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నవంబర్‌ 14న నాడు- నేడు కార్యక్రమం ప్రారంభిస్తామని వెల్లడి.

★ మొదటి దశలో 15 వేలకు పైగా పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిషు మాధ్యమంలో బోధన ఉంటుందన్నారు.

★ ఒక్కో ఏడాది తదుపరి తరగతుల్లో ఇంగ్లీషు విద్యా బోధన ప్రవేశపెడతామని.. అయితే *తెలుగు తప్పనిసరి సబ్జెక్టు* అన్నారు.

★ *జనవరి 1 నుంచి టీచర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది.*

★ స్కూళ్లలో ఇంగ్లిషు ల్యాబ్స్‌ కూడా ఉండాలి. టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, ఫర్నిచర్, పెయింటింగ్‌ పనులు, మరమ్మతులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు,

★ హైస్కూల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణం.. ఇవన్నీ నాడు- నేడు కార్యక్రమంలో భాగమే.

★ తల్లిదండ్రులతో ఏర్పడ్డ కమిటీల భాగస్వామ్యం తీసుకోండి. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి. డిసెంబర్‌లోగా పాఠ్యాప్రణాళిక ఖరారు చేయాలి’ అని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top