JAGANANNA AMMA VODI Implementation of the programme from the academic year 2019-2020 Guidelines GO.79 Dt:4.11.19

▪ 2020 సంవత్సరం జనవరి 26వ తేదీ నుండి అమ్మఒడి పథకాన్ని అమలు

▪ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు డిసెంబర్ 31వ తేదీ నాటికి 75 శాతం హాజరు ఉంటే మాత్రమే అమ్మఒడి పథకానికి అర్హులు

▪75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతూ ఉండటం పట్ల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

వివరాలు సేకరించడానికి గ్రామ వాలంటీర్ల సేవలు:


▪ అమ్మఒడి పథకానికి గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

▪గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా అమ్మఒడి పథకానికి సంబంధించిన వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

▪గ్రామ, వార్డు వాలంటీర్లు వారికి కేటాయించిన ఇళ్లలో చదివే విద్యార్థుల వివరాలు మండల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందించాల్సి ఉంటుంది.

అర్హత సాధించిన వారికి ఎప్పుడు అమౌంట్ జమ అవుతుంది?


▪అర్హత సాధించిన విద్యార్థుల యొక్క తల్లి బ్యాంకు వివరాలను ప్రభుత్వం సేకరించి జనవరి 26వ తేదీన వారి ఖాతాలలో నగదు జమ చేయనుంది.

ఎవరెవరు ఖాతా లో అమౌంట్ జమ చేస్తారు

విద్యార్థికి తల్లి లేకపోతే తండ్రి బ్యాంకు ఖాతా వివరాలను తల్లి తండ్రి ఇద్దరూ లేకపోతే సంరక్షకుని బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి వారి ఖాతాలలో నగదును ప్రభుత్వం జమ చేస్తుంది.

అర్హత సాధించడానికి ధ్రువపత్రాలు ఏమి అవసరం?

 ఈ పథకానికి అర్హత పొందాలంటే తెల్ల రేషన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డ్ వివరాలను కూడా రేషన్ కార్డ్ వివరాలతో పాటు ప్రభుత్వం సేకరించనున్నట్లు తెలుస్తోంది.

 ▪ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివేవారికి ఈ పథకం వర్తిస్తుంది.

Jagananna Amma Vodi Complete Guidelines GO:79 Dt:04-11-2019
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top