మీ ఆధార్-రేషన్ కార్డు లింక్ చేశారా?

మీ ఆధార్-రేషన్ కార్డు లింక్ చేశారా? Last Date ఎప్పుడంటే


ఆధార్ కార్డుతో రేషన్ కార్డును ఎలా లింక్ చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి? ఎన్ని విధాలుగా ఆధార్, రేషన్ అనుసంధానం ప్రక్రియ ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.

కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే :

* కుటుంబ సభ్యులందరితో కూడిన ఆధార్ కార్డుల ఒరిజినల్స్ ఒక కాపీ ఉంచుకోవాలి.
* వెరిఫికేషన్ ప్రక్రియ కోసం అందరి ఆధార్ కార్డులను సిద్ధం చేసుకోవాలి.
* రేషన్ కార్డు ఒక కాపీ (నకలు) జిరాక్స్ దగ్గర పెట్టుకోండి.
* బ్యాంకు పాస్ బుక్ కాపీ ఒకటి (మీ బ్యాంకు అకౌంట్.. ఆధార్ లింక్ చేయకపోతే)
* పాస్ పోర్టు సైజు ఫొటోగ్రాఫ్స్ అవసరం మేరకు

 1 . Online Modeలో ఆధార్-రేషన్ కార్డు లింక్ :

* అధికారిక ఆధార్ uidai.gov.in లింకింగ్ వెబ్‌సైట్ విజిట్ చేయండి.
* Start Now బటన్ పై క్లిక్ చేయండి.
* మీ అడ్రస్ వివరాలు, జిల్లా, రాష్ట్రం పేరు ఎంటర్ చేయండి.
* మీది ఏ రకమైన Ration Cardలో ఆప్షన్ నుంచి ఎంచుకోండి
* రేషన్ కార్డుపై ఉన్న పథకం పేరును ఎంపిక చేసుకోండి.
* మీ రేషన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
* మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.
* మీకు వచ్చిన OTP ఎంటర్ చేయడంతో మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
* మీ దరఖాస్తు విజయవంతంగా వెరిఫై అయ్యాక ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ అయినట్టే.

2. Offline Modeలో* ఆధార్ + రేషన్ కార్డు లింక్ :

* PDS సెంటర్ లేదా Ration షాపు దగ్గరకు తప్పక వెళ్లాల్సి ఉంటుంది.
* పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ (రేషన్) షాపులో అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి.
* ఒకసారి డాక్కుమెంట్లు సబ్మిట్ చేశాక.. సంబంధిత శాఖకు వెళ్తాయి.
* ఆ తర్వాత మీకు ఈమెయిల్ లేదా SMS రూపంలో నోటిఫికేషన్ వస్తుంది.
* అధికారులు మీ డాక్యుమెంట్లను వెరిఫై చేశాక మరోసారి మీకు నోటిఫికేషన్ పంపిస్తారు.
* అంటే.. మీ ఆధార్ కార్డుతో రేషన్ కార్డు విజయవంతంగా అనుసంధానమైనట్టే.

3. SMS ద్వారా ఆధార్ + రేషన్ కార్డు లింకింగ్ :

* మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి UID SEED అని టైప్  కొంచెం Space ఇవ్వండి.
* <State షార్ట్ Code><Scheme/Program Short Code><Scheme/Program ID><Aadhaar Number> వివరాలు ఎంటర్ చేయండి.
* ఆ తర్వాత 51969 అనే ఈ నెంబర్ కు SMS పంపండి.
* ఉదాహరణకు.. UID SEED MH POSC 9876543 123478789012 అని ఈ విధంగా ఎంటర్ చేయాలి.
* వెరిఫికేషన్ సక్సెస్ అయినట్టుగా మీకో నోటిఫికేషన్ వస్తుంది.
* మీ ఆధార్ కార్డుతో మీ రేషన్ కార్డు విజయవంతంగా అనుసంధానం ప్రక్రియ పూర్తి అయినట్టే.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top