రాష్ట్రంలోనే ఆదర్శం ఎస్.ఆర్.నగర్ పాఠశాల

తూర్పు గోదావరి జిల్లాలో కాజులూరు మండలం లోని ఎస్సార్ నగర్ మండల పరిషత్ పాఠశాలలో పని చేస్తున్నా sistla చలపతి మాస్టారు గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి లేదు ఆయన పాఠశాలను ఈ విధంగా అభివృద్ధి చేశారు ఆయన మాటల్లోనే..........

స్కూలంటే మాదే...A PROUD ANNOUNCEMENTM MPPP SCHOOL, SR NAGAR, KAJULURU, EG Dt.


ప్రభుత్వం రేపటి నుండి ప్రారంభించబోయే "నాడు....నేడు" కార్యక్రమం ద్వారా రాబోయే మూడు సంవత్సరాలలో  పాఠశాలల అభివృద్ధిని మా పాఠశాల ఇప్పటికే దాతల మరియు గ్రామస్తుల సహకారంతో ( సుమారు 15,00,000/- రూపాయల విరాళాలతో)  సాధించిందని సగర్వంగా తెలియచేస్తున్నాను.

మా పాఠశాలలో నేను 2013వ సంవత్సరం మే నెల 17వ తేదీన చేరినప్పటి నుండి ఇప్పటివరకు సాధించిన అభివృద్ధి వివరాలు.....


కాంపౌండ్ వాల్
కళావేదిక  (stage)
ఉపాధ్యాయులందరకీ టేబుల్స్..చైర్స్
విద్యార్ధులు అందరకీ డెస్క్ కమ్ బెంచెస్
1,2 పిల్లల కోసం రౌండ్ బెంచెస్..చైర్స్
డిజిటల్ క్లాస్ రూమ్ విత్ ప్రొజెక్టర్ విత్ 4 స్పీకర్స్
మినరల్ వాటర్ ఫెసిలిటీ
రన్నింగ్ వాటర్ తో కూడిన సెపరేట్ టాయిలెట్స్
3 కంప్యూటర్స్
హెచ్ పి ప్రింటర్
పాఠశాల మొత్తం పెయింటింగ్స్
ట్రాలీ  సౌండ్ సిస్టమ్
ఆంప్లిఫయిర్ విత్ మైక్స్
ఇంటర్ నెట్
ల్యాండ్ లైన్ ఫోన్
55"  కలర్ టి వి విత్ 4 స్పీకర్స్
ఉచిత నోటు పుస్తకాలు
ఉచిత స్కూల్ బ్యాగ్
పాఠశాలలో సిమెంట్ రోడ్
పాఠశాల ఆవరణ ఎత్తు చేయించడం
పాఠశాలలో 25 రకాల చెట్లు
మహాత్మాగాంధీ విగ్రహం
సరస్వతీదేవి విగ్రహం
నాలుగుసింహాల విగ్రహం
వివేకానందుని విగ్రహం
భారతదేశం మ్యాప్ విగ్రహం
ఇంగ్లీషు మీడియం
3 గోద్రేజ్ బీరువాలు
విద్యార్ధుల స్పెషల్ యూనిఫారం (బుధవారం)
ఐడి కార్డ్..టై..బెల్ట్
పాఠశాల అక్వేరియం ( పాఠశాలలోనే చిన్న చెరువు )
విద్యార్ధుల రోలు 35 నుండి 135 కి పెంపుదల
2 ఉపాధ్యాయుల పాఠశాలకి 5 ఉపాధ్యాయుల స్థాయి
సుమారు 200 గ్రంధాలయ పుస్తకాలు
9 ఫ్యాన్లు...8 ట్యూబ్ లైట్స్
ఆట వస్తువులు
పాఠశాల కపౌండ్ వాల్ పై ఫ్లాగ్స్
జెండా దిమ్మె
వాష్ బేసిన్స్
తరగతి గదులకు గ్రిల్స్
25 కుండీలలో మొక్కలు
నిజాయతీ దుకాణం
చాక్లెట్ బాక్స్
సంచయిక

పాఠశాల చిత్రాలు

5 వ తరగతి పాఠ్యాంశం "అన్నం"  లో భాగంగా మా పాఠశాలలో 5 వ తరగతి  విద్యార్థులను పొలం బాట పట్టించి రైతుల శ్రమ మరియు అన్నం విలువను ప్రత్యక్షపద్ధతి లో బోధించడం జరిగింది. 
విద్యార్ధులను మరియు నన్ను పొలంలో చూడగానే ఏంటి మాస్టారూ..ఇలా వచ్చారు, చదువుకోకపోతే మావలె కష్ట పడాలి అని చెప్పడానికి తీసుకువచ్చారా పిల్లల్ని  అని అడిగారు అక్కడున్న రైతుకూలీలు.
అయ్యో...కాదండి..మనం ప్రతిరోజూ తినే అన్నం రైతులు మరియు రైతుకూలీలు  ఎంత కష్టపడితే దొరుకుతుందో చెప్పడానికి తీసుకువచ్చాను అని చెప్పాను.
అలాగే ప్రతిరోజూ మా పాఠశాల విద్యార్ధులు మధ్యాహ్న భోజన సమయంలో చేసే ప్రార్థన అక్కడ చేయించడం జరిగింది. ప్రార్ధన విన్న రైతులు చాలా సంతోషపడ్డారు.
పిల్లలతో ఆకుమడి నుండి ఊడ్పు చేసే  క్రియ చేయించినాము.
పిల్లలు ప్రతిరోజూ పొలం చూస్తూనే ఉంటారు...కానీ ఈరోజు ప్రత్యక్షంగా పొలం పని చెయ్యడంతో చాలా సంతోషపడ్డారు.అన్నిటికన్న ముఖ్యంగా గ్రామస్తుల మరియు తల్లిదండ్రుల,నాతోటి ఉపాధ్యాయుల, విద్యార్ధుల  మరియు పేరెంట్స్ కమిటీ  సహకారం.

ఎప్పుడు ఏ విషయం‌పై అడిగినా కాదనకుండా స్పందించే నా మిత్రులైన ( శ్రీ అన్యం శ్రీరామచంద్రమూర్తి గారు,శ్రీ దేవులపల్లి వేంకటరమణ మూర్తి గారు, శ్రీ కంచర్ల సత్యనారాయణ గారు, శ్రీ సలాది వీరబాబు గారు,శ్రీ నామా శ్రీనివాస్ మిత్రబృందం) వంటి   దాతల సౌహార్ద్ర హృదయం.

పాఠశాల లో జరిగే కార్యక్రమాల వివరాలు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్న పాత్రికేయ మిత్రులందరకీ ధన్యవాదాలు.

నేను పాఠశాలకోసం ఎంత టైమ్ కేటాయించినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నన్ను వారించని నా కుటుంబం.


Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

APSCERT Abhayasa Spoken English Course DD Saptagiri 10th Class Live ClassesSubscribe My Whatsapp & Telegram Groups Promotion Lists Software More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top