Jagananna Amma Vodi Further Guidelines Rc.242 DT:2.12.2019

అమ్మ ఒడి పథకం ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ను ప్రారంభించింది వెబ్సైట్లు ఎలా లాగిన్ అవ్వాలి పూర్తి వివరాలు

Jagananna Amma Vodi latest Instructions Rc.242 DT:2.12.19


అమ్మఒడి తాజా విధి విధానాలు


పాఠశాల విద్యాశాఖ కమీషనరు, ఆంధ్రప్రదేశ్ వారి కార్యావర్తనములు
ప్రస్తుతం శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఎ.ఎస్.
ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేదీ : 22.11.2019

విషయం : పాఠశాల విద్యాశాఖ-సవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20) విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు.

నిర్దేశములు :


1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-II) వారి ఉత్తర్వులు నెం. 79, తేది : 4.11.2019

2. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & W/2019, తేది: 16.11.2019

ఆదేశములు:

   'జగనన్న అమ్మ ఒడి' కార్యక్రమం అమలులో భాగంగా అర్హులైన తల్లుల/ సంరక్షకుల జాబితాను సిద్ధం చేసేందుకు పై సూచిక 2లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

    పరిపాలన సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకుని, పై సూచిక 2 లోని ఆదేశములకు కొనసాగింపుగా ఈ దిగువ సూచనలను ఇవ్వడమైనది.

    పై సూచిక 1లోని ఆదేశాలను అనుసరించి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 17.11.2019 నుండి 21.11.2019 మధ్య కాలంలో తమ తమ పాఠశాలలోని విద్యార్థుల వివరములను చైల్డ్ ఇన్ఫోనందు నమోదు! నవీకరణ చేయడమైనది. ఆ విధంగా చైల్డ్ ఇన్ఫోలోని విద్యార్థుల వివరములు 21.11.2019న ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారికి అందించడమైనది.

ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారి ద్వారా తల్లుల లేదా సంరక్షకుల వివరాలను జతపరచటం


1. ఎపి ఆన్లైన్ ద్వారా తమకు అందిన చైల్డ్ ఇన్ఫోను ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు రేషన్ కార్డుల జాబితాతో మరియు ప్రజాసాధికార సర్వే సమాచారంతో సరిపోల్చి తెల్ల రేషన్ కార్డులో ఉన్న తల్లుల లేదా సంరక్షకుల వివరాలను సేకరించి ఆ మొత్తం సమాచారాన్ని ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు విద్యార్థి వారీగా అనుసంధానం చేస్తారు.

2. ఈ కార్యక్రమం 23.11.2019 నాటికి పూర్తి చేసి ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు ప్రతి ప్రధానోపాధ్యాయుడికి 'లాగ్ ఇన్ ఐడి' మరియు 'పాస్ వర్డ్' ద్వారా 24.11.2019న అందచేస్తారు.

3. ఎపిసిఎఫ్ఎస్ఎస్ వారు ప్రధానోపాధ్యాయుడికి అందచేసే ఈ సమాచారం పాఠశాలలోని తరగతి విద్యార్ధుల వారీగా ఉంటుంది.

4. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా అందిన వివరాలను సరిపోల్చుకొనుట, నమోదు చేయుట మరియు ధృవీకరించుకొనుటకు విద్యార్థుల, తల్లి/ సంరక్షకుల పేరు, ఆధార్ నంబరు మరియు బ్యాంకు
ఖాతా వివరములను 24.11.2019 లోపు సేకరించి, ఆన్ లైన్ లో నమోదు చేయుటకు సిద్ధంగా ఉండవలెను.

ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా అందిన వివరాలను సరిపోల్చుకొనుట, నమోదు చేయుట మరియు ధృవీకరించుకొనుట

5. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎపిసిఎస్ ద్వారా తమకు అందిన సమాచారాన్ని ప్రధానోపాధ్యాయుడు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. తరగతి వారీగా విద్యార్థుల వివరములు సరిపోల్చుకుంటూ వారి తల్లి సంరక్షకుడు వివరములను (తల్లి/ సంరక్షకుని పేరు, ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా వివరములు) నమోదు చేయాలి. ఒకవేళ ఆ వివరములన్నీ ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా తమకు అందిన సమాచారంలో ముందుగానే పొందుపరచి ఉంటే వాటిని ధృవీకరించుకోవాలి. ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకోవాలి. (వాడుక సూచికను జతపరచడమైనది) ఆ విధంగా వివరములు నమోదు పరిచిన తరువాత విద్యార్థుల స్వగ్రామాల మరియు మండలాల వారీగా సంబంధిత విద్యార్థుల మరియు తల్లులు, సంరక్షకుల జాబితాను సదరు మండల విద్యాశాఖాధికారికి పంపవలసి ఉంటుంది.

6. 100 లోపు విద్యార్థులు గల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ సమాచారాన్ని 25.11.2019 లోగా విద్యార్థుల స్వగ్రామాలకు సంబంధించిన మండల విద్యాశాఖాధికారి వారికి పంపాలి. 101 నుండి 300 లోపు విద్యార్థులు గల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ సమాచారాన్ని 26.11.2019 లోగా విద్యార్థుల స్వగ్రామాలకు సంబంధించిన మండల విద్యాశాఖాధికారి వారికి పంపాలి. 300 లకు పైగా విద్యార్థులు గల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ సమాచారాన్ని 27.11.2019 లోగా విద్యార్థుల స్వగ్రామాలకు సంబంధించిన మండల విద్యాశాఖాధికారి వారికి పంపాలి. ప్రధానోపాధ్యాయుడు ధృవీకరించిన సమాచారం వారివారి స్వగ్రామానికి సంబంధించిన మండల విద్యాశాఖాధికారికి స్వయంచాలకంగా (ఆటోమేటిగ్గా) చేరుతుంది.గ్రామాల వారీగా జాబితాలను ముద్రించి క్షేత్ర పరిశీలనకు పంపడం

7. ఆ విధంగా మండల విద్యాశాఖాధికారి వారికి రాష్ట్రంలోని వివిధ పాఠశాలల నుంచి ఆ మండలంలోని గ్రామాలకు సంబంధించిన విద్యార్థుల, తల్లి/ సంరక్షకుల వివరములు చేరుతాయి. మండల విద్యాశాఖాధికారి తమకు చేరిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారి సిబ్బంది ద్వారా గ్రామాల వార్డులు వారీగా జాబితాలను ముద్రించి సంబంధిత గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకునికి అండజేయాలి. ఒకవేళ గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకుడు అందుబాటులో లేని యెడల ఆ గ్రామ జాబితాలను సంబంధిత క్లస్టర్ రిసోర్సు పర్సను అందజేయాలి.

క్షేత్రస్థాయి పరిశీలన

8. గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకుడు/ క్లస్టర్ రిసోర్సు పర్సన్ మండల విద్యాశాఖాధికారి ద్వారా తనకందిన జాబితాలను సంబంధిత గ్రామ/వార్డు వాలంటీర్లకు అందచేయాలి. వారి ద్వారా ఆ సమాచారాన్ని ఆయా కుటుంబాలకు వివరించి తద్వారా ఆ సమాచారంలో లేని వివరాలు అనగా తల్లుల పేర్లు, తెల్ల రేషను కార్డు వివరాలు, ఆధార్ నెంబరు, బాంకు అకౌంటు నెంబరు, ఐఎఫ్ఎస్ సీ కోడు నెంబరు మొదలైన వివరాలను సేకరించాలి. ఆ సమాచారంలో తెల్ల రేషను కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద / అర్హత కలిగిన కుటుంబాలకు చెందిన వారు అవునో కాదో ఆరు అంచెల పరిశీలన (సిక్స్ స్టెప్ వాలిడేషన్) ద్వారా ధృవీకరించుకోవాలి. ఈ కార్యక్రమమంతా 30.11.2019 లోపు పూర్తి చేయాలి.

9. ఆ విధంగా గ్రామ/ వారు వాలంటీర్లు క్షేత్రస్థాయిలో నమోదు చేసిన/ ధృవీకరించిన సమాచారాన్ని అనగా ఆ 'హార్డ్ కాపీ'లను సంబంధిత విద్యా, సంక్షేమ సహాయకుడు/ క్లస్టర్ రిసోర్సు పర్సన్ తమ మండల విద్యాశాఖాధికారికి నేరుగా అందచేయాలి.

10. తదుపరి కార్యాచరణ ప్రణాళికపై ఉత్తర్వులు తదుపరి కార్యావర్తనముల ద్వారా తెలియజేయబడతాయి.

11. రాష్ట్రంలోని అందరు జిల్లా విద్యాశాఖాధికారులు మరియు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లు, డివిజనల్, మండల విద్యాశాఖాధికార్లు, క్లస్టర్ రిసోర్సు పర్సన్లు మరియు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, రాష్ట్ర స్థాయి పరిశీలకులు పూర్తి శ్రద్ధతో పై విధి విధానాలను అత్యంత జాగరూకతతో అమలుచేయవలసినదిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది.

Sd/-(చినవీరభద్రుడు)
కమీషనర్, పాఠశాల విద్య (పూ. అ.బా)


👉 23.11.2019:ప్రధానోపాధ్యాయులు తల్లి/ సంరక్షకులు బ్యాంక్ ఎకౌంట్ నెంబర్, IFSC code, బ్యాంకు పేరు, తల్లి సంరక్షకులు నివసిస్తున్న గ్రామం , రేషన్ కార్డు నెంబర్ , విద్యార్థుల హాజరు శాతం వివరాలు ముందుగా సేకరించాలి.

👉 విద్యార్థుల హాజరు శాతాన్ని లెక్కించేటప్పుడు పాఠశాల  రీ-ఓపెన్ చేసినప్పటి నుండి లెక్కించాలి . విద్యార్థి ఇటీవలే జాయిన్ అయితే ఆ రోజు నుండి హాజరు శాతాన్ని తగ్గించాలి.

24.11.19 - 27.11.19:

👉 24.11.19 న పాఠశాల ప్రధానోపాధ్యాయులకు user I'd/ password ఇవ్వబడుతుంది.

👉 మీకు ఇవ్వబడిన యూజర్ ఐడి/ పాస్వర్డ్ ద్వారా 100 లోపు విద్యార్థుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు 25.11.19, 

👉 300 లోపు విద్యార్థుల పాఠశాల 26.11.19, 

👉 300 పైగా ఉన్న  విద్యార్థులు గల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 27.11.19 లోగా పూర్తి చేయవలెను.

👉 విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కొంత మంది విద్యార్థులకు చొప్పున ఉపాధ్యాయులకు కేటాయించి డేటా upload చేయవలెను

👉 బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ మాత్రం జాగ్రత్తగా ఉంటుంది మిగిలిన ఆప్షన్స్  డ్రిల్ డౌన్ పద్ధతిలో ఉంటాయి

👉 27.11.19 నాటికి ప్రధానోపాధ్యాయులు డేటా upload చేసి MEO కు పంపించగలరు

👉 తల్లి/  సంరక్షకులు నివసిస్తున్న గ్రామం ఆధారంగా సంబంధిత డేటా మండల విద్యాశాఖ అధికారి కి చేరుతుంది

👉 MEO లు పాఠశాల నుండి వచ్చే reportsను  CRPs/ Teachers సహకారం తీసుకుని reports print తీసుకోవాలి

👉 Print తీసిన reports గ్రామాల వారీగా CRPs ద్వారా Welfare & Education assistant కు తద్వారా గ్రామ వాలంటీర్లు report ఆరు అంచెల ఈ విధానం ద్వారా ధ్రువీకరణ చేస్తారు 

👉 ధ్రువీకరణ చేసిన డేటా ను తిరిగి కి 30.11.2019 న మండల విద్యాశాఖ అధికారి కి పంపించగలరు

👉 ఈ మొత్తం ప్రక్రియలో పేరెంట్స్ కమిటీని భాగస్వామ్యం చేయాలి

HMs login లో అమ్మ ఓడి వివరాలు సంబంధించి చేయవలసిన నమునా.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top