షుగర్ ఉన్నవారు అన్నం తినవచ్చా..?

డయాబెటిస్ ఉన్నవారు అన్నం నిరభ్యంతరంగా తినవచ్చు. మానేయాల్సిన పనిలేదు.

▪కాకపోతే ఒక పూటకే పరిమితం కావాలి

మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రతి ఏటా చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. టైప్ 1, టైప్ 2 అని రెండు రకాల డయాబెటిస్ లతో చాలా మంది సతమతం అవుతున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిత్యం డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే డయాబెటిస్ వచ్చిందంటే చాలు.. మన దగ్గర చాలా మందిని అన్నం మానేయమని చెబుతుంటారు. మరి డయాబెటిస్ ఉన్నవారు నిజంగానే అన్నం మానేయాలా ? అన్నం తినకూడదా ? తింటే ఏమవుతుంది ? వంటి సందేహాలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం.

▪డయాబెటిస్ ఉన్నవారు అన్నం నిరభ్యంతరంగా తినవచ్చు. మానేయాల్సిన పనిలేదు.

▪ కాకపోతే ఒక పూటకే పరిమితం కావాలి.

▪ తక్కువ మోతాదులో తీసుకోవాలి. లేదా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవచ్చు.

▪ అన్నం తినేటప్పుడు అందులో కలుపుకునే కూర పరిమాణం ఎక్కువగా ఉండాలి. దీనివల్ల అన్నం గ్లైసీమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఫలితంగా అన్నం తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

▪డయాబెటిస్ వచ్చిన వారు అన్నం తింటుంటే.. దాంతోపాటు తాజా కూరగాయలు, పండ్లు తినేలా చూసుకోవాలి.

▪దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరగకుండా ఉంటాయి.

▪ఇక డయాబెటిస్ ఉన్నవారు వ్యాయామం కచ్చితంగా చేయాలి. ఈ విధమైన ఆహార శైలిని పాటిస్తే.. డయాబెటిస్ ఉన్న వారు కూడా ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా అన్నం తినవచ్చు. దాని వల్ల ఏ ప్రమాదం ఉండదు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top