టెన్త్‌ మెమోలపై క్యూఆర్‌ కోడ్‌

▪పదవ తరగతి నకిలీ మెమోలను అరికట్టేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది.

▪ఇందులో భాగంగా పది మెమోలపై ఇకపై క్యూఆర్‌ కోడ్‌ పొందుపరిచేందుకు చర్యలు చేపడుతోంది.

▪దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించేందుకు సిద్ధమవుతోంది.

▪2004 నుంచి పదో తరగతి మెమోలను ఆన్‌లైన్‌లో పొందుపరిచిన ప్రభుత్వ పరీక్షల విభాగం అంతకుముందుకు మెమోలనూ ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు కసరత్తు చేస్తోంది.

▪ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన వారు అందజేసిన మెమోలు నకిలీవా? అసలైనవా? అని గుర్తించేందుకు ఈ విధానాన్ని తీసుకువస్తోంది.
▪ఇకపై విద్యార్థులకు ఇచ్చే మెమోలపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించే ఆలోచనకు వచ్చింది.

▪తద్వారా నకిలీ మెమోలను అరికట్టవచ్చని భావిస్తోంది.

▪అసలైన మెమోపై ముద్రించిన క్యూఆర్‌ కోడ్‌ను రీడ్‌ చేస్తే సదరు అభ్యర్థి సమగ్ర వివరాలు తెలుస్తాయని, అదే నకిలీ మెమోపై క్యూఆర్‌ కోడ్‌ ఉండదని, ఒకవేళ ఏదైనా ముద్రించినా ఆ వివరాలు రావని, తద్వారా మెమోలు నకిలీవి తయారు చేయకుండా నిరోధించవచ్చని అధికారులు చెబుతున్నారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top