Teachers Transfers in Pongal Holidays సంక్రాంతిలో టీచర్ల బదిలీలు

సంక్రాంతిలో టీచర్ల బదిలీలు
        వచ్చే ఏడాది సంక్రాంతి సెలవుల్లో టీచర్ల సాధారణ బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. వాస్తవానికి వేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించినప్పటికీ వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో జనగణన విధులను టీచర్లు చేపట్టాల్సి ఉండడంతో బదిలీలు జరిగే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల నుంచి బదిలీల కోసం ఒత్తిడి ఉంది. దీనికి అనుగుణంగానే సంక్రాంతి సెలవుల్లో టీచర్ల సాధారణ బదిలీలు నిర్వహిం చేందుకు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా కొద్దిరోజుల్లోనే వెలువడనున్నట్టు తెలిసింది.

  1.  ఈ ఏడాది నవంబరు 30వ తేదీ నాటికి గరిష్ఠ సర్వీసుగా ఎనిమిదేళ్లు (ఒకే స్కూలులో) ఉన్న టీచర్లను తప్పనిసరి బదిలీ చేసే అవకాశం ఉంది.
  2.  దీనికితోడు బదిలీలకు ముందే హేతుబద్దీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియను చేపట్టనున్నారు. 
  3. దీనికి కూడా కటాఫ్ డేట్ ను ఈ ఏడాది నవంబరు 30వ తేదీగా తీసుకోవాలని విద్యాశాఖ యోచిస్తున్నట్టు తెలిసింది.
  4. విద్యార్థుల సంఖ్య 10, 20, 30 ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ నిష్పత్తి ప్రాతిపదికన రేషనలైజేషన్ చేయనున్నారు.
  5. తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా స్కూల్ మ్యాపింగ్ చేయనున్నట్టు తెలిసింది.



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top