కొత్తగా 3 జిల్లాలు!

కొత్తగా 3 జిల్లాలు!
మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా ఏర్పాటు
వైద్య కళాశాలలకు ఎంసీఐ సాయం కోసం ఈ నిర్ణయం
మంత్రివర్గంలో ఆమోదం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన చేయలేదు. మచిలీపట్నం, అరకు, గురజాలల్లో వైద్య కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసింది. ఒక వైద్య కళాశాలను నెలకొల్పాలంటే రూ.500- రూ.600 కోట్ల వరకూ వ్యయమవుతుంది. అక్షరాస్యత, వైద్య వసతులు తక్కువగా ఉండి, అసలు ఎలాంటి వైద్య కళాశాలలు లేని బాగా వెనుకబడి ఉన్న జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేస్తే... అందుకయ్యే వ్యయంలో 60శాతం వరకూ భారత వైద్య మండలి (ఎంసీఐ) సమకూర్చే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే తొలి దశలో పైన పేర్కొన్న 3 ప్రాంతాలను జిల్లాలుగా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇకపై దశల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top