Budget 2020 బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌

 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్‌ ఇది. 


కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌

ధరలు పెరిగేవి 

ఫర్నీచర్‌ 
చెప్పులు 
సిగరెట్లు 
పొగాకు ఉత్పత్తులువైద్య పరికరాలు 
కిచెన్‌లో వాడే వస్తువులు 
క్లే ఐరన్‌ 
స్టీలు 
కాపర్‌ 
సోయా ఫైబర్‌, సోయా ప్రోటీన్‌ 
కమర్షియల్‌ వాహనాల విడిభాగాలు 
స్కిమ్డ్‌ మిల్క్‌ 
వాల్‌ ఫ్యాన్స్‌ 
టేబుల్‌వేర్

ధరలు తగ్గేవి 

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్‌ ప్రింట్‌ 
ఎలక్ట్రిక్‌ వాహనాలు 
మొబైల్‌ ఫోన్ల విడిభాగాలు

ఆదాయపు పన్ను  స్లాబ్ లలో మార్పు

ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను లేదు

5 లక్షల నుంచి ఏడున్నర లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి 10 శాతం పన్ను

ఏడున్నర లక్షల నుంచి 10 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి 15 శాతం పన్ను

పది లక్షల నుంచి 12.50 లక్ష ఆదాయం కలిగిన వారికి 20
 శాతం పన్ను

12.50 లక్ష నుంచి 15 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి 25 శాతం పన్ను

15లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను

Note:-2.5 లక్షల నుండి 5 లక్షల వరకు పన్ను యథాతథం!అంటే 5 లక్షల లోపు ఆదాయం కలిగిఉంటే పన్ను ఉండదు కానీ,ఆదాయం 5 లక్షల రూపాయలు దాటితే 2.5 లక్షల నుండి పన్ను 5%  చెల్లించాల్సి ఉంటుంది.
ఆదాయపు పన్ను రెండు స్లాబ్లులలో చెల్లించవచ్చు!

కొత్త స్లాబ్ తో పన్ను చెల్లించేవారికి 80(c) రిబేటు వర్తించదు:-ఆర్థిక మంత్రి

NEW slab rates

Income range.   Old.    New
Up to 5 L.                       Nil
5 L to 7.5 L.      20%      10%
7.5 L to 10 L.    20%      15%
10L to 12.5L.    30%      20%
12.5L to 15L.    30%.     25%

Above 25L.       30%.      30%

Income tax నందు రెండు  విధానాలు అమలు. 


 మొదటి విధానంలో ప్రస్తుతం అమలవుతున్న స్లాబ్స్ ఉంటాయి.

 రెండవ రకంలో 80 (C) కింద ఇచ్చే మినహాయింపు ఇవ్వరు.

 ఏది కావాలో ఉద్యోగులకు ఇష్టం.

పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల‌ ముఖ్యాంశాలు

* వ్యవసాయ రంగానికి రూ. 2.83 లక్షల కోట్లు.
* గ్రామీణాభివృద్ధికి రూ. 1.23 లక్షల కోట్లు.
* ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 15 లక్షల కోట్లు.
* స్వచ్చ భారత్ మిషన్ కోసం రూ. 12,300 కోట్లు.
* జల్ జీవన్ మిషన్ కు రూ. 3.06 లక్షల కోట్లు.
* విద్యా రంగానికి రూ. 99,300 కోట్లు.
* నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ. 3 వేల కోట్లు.
* ప్రధాని ఆవాస్ యోజన ద్వారా దేశంలోని పేదలందరికీ సొంత ఇళ్లు.
* మొదటి ప్రాధాన్యాంశం వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి.
* రెండో ప్రాధాన్యతగా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు.
* మూడో ప్రాధాన్యాంశంగా విద్య, చిన్నారుల సంక్షేమం.
* 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం.
* కౌలు రైతుల కోసం త్వరలోనే కొత్త చట్టం.
* ప్రధాని ఫసల్ బీమా ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు బీమా.
* పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి.
* గ్రామీణ కృషి సంచాయ్ యోజన ద్వారా సూక్ష్మ, సాగునీటి విధానాలకు ప్రోత్సాహం.
* గ్రామీణ సడక్ యోజన, ఆర్థిక సమ్మిళిత విధానాలతో రైతులకు మేలు.
* పంటల దిగుబడిని మరింతగా పెంచేందుకు కృషి.
* వ్యవసాయ విపణులు మరింత సరళీకృతం.
* వర్షాభావ నిధులకు అదనంగా నిధులు, సాగునీటి సౌకర్యం.
* రైతులకు 20 లక్షల సోలార్ పంపుసెట్లు, బీడు భూముల్లో సోలార్ యూనిట్లకు పెట్టుబడి సాయం.
* రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి. సేంద్రీయ ఎరువుల వాడకంపై అవగాహన.
* భూసార పరిరక్షణకు అదనపు సాయం, సంస్కరణల అమలు.
* రైతులకు సహాయంగా నాబార్డు నిధులతో మరిన్ని గిడ్డంగుల నిర్మాణం.
* పీపీపీ పద్ధతిలో ఎఫ్సీఐ ఆధ్వర్యంలో గోడౌన్ల నిర్మాణం.
* పంటల కొనుగోలుకు నాబార్డు ద్వారా ఎస్ఎస్జీలకు సహాయం.
* కూరగాయల సరఫరాకు కృషి ఉడాన్ యోజన.
* ప్రత్యేక విమానాల ద్వారా పండ్లు, కూరగాయలు, పూల ఎగుమతులు.
* ఉద్యాన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం.
* కేంద్రంతో పాటు రాష్ట్రాల నుంచి కూడా ఉద్యాన పంటలకు అదనపు నిధులు.
* ఉద్యాన పంటల కోసం ప్రత్యేక క్లస్టర్లు.
* పాల ఉత్పత్తుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కృషి.
* కరవు జిల్లాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు.
* ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే వారికి మరింత ప్రోత్సాహం.
* మత్స్యకారుల కోసం నూతనంగా 3,400 'సాగర్ మిత్ర'లు.
* మత్స్యకారుల కోసం నూతనంగా 3,400 'సాగర్ మిత్ర'లు.
* ఆల్గే, సీవీ కేజ్ కల్చర్ విధానంలో మత్స్య పరిశ్రమకు ప్రోత్సాహకాలు.
* కోస్తా ప్రాంతాల్లోని గ్రామీణ యువతకు మత్స్య పరిశ్రమలతో మరింత ఉపాధి.


తొలి ప్రాధాన్యం : వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి

ద్వితీయ ప్రాధాన్యాంశం : ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు

మూడో ప్రాధాన్యాంశం : విద్య, చిన్నారుల సంక్షేమం

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం


2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం బడ్జెట్‌ లక్ష్యం
రైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు
100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలు
26 లక్షల మంది రైతులకు సోలార్‌ పంపు సెట్లు
పేదరికం నుంచి 27 కోట్లమందిని బయటకు తెచ్చాం
ఇక నుంచి ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ల ఫైలింగ్‌ మరింత సులభతరం చేస్తాం
ఆరు కోట్ల 11 లక్షల మందికి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన

విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి
విద్య, స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి
2026నాటికి 150 వర్సిటీల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కొత్త కోర్సులు
ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సులు
నేషనల్‌ పోలీస్‌, ఫోరెన్సిక్‌ యూనివర్సిటీ ప్రారంభిస్తాం
భారత్‌లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ఇన్సాట్‌ పరీక్షలు
ప్రస్తుతం ఉన్న ప్రతి జిల్లా ఆస్పత్రికి మెడికల్‌ కాలేజీ
యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకం
గ్లోబలైజేషన్‌కు అనుగుణంగా పరిశ్రమల అభివృద్ధి
ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ ఏర్పాటు
ల్యాండ్‌ బ్యాంక్‌, ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రత్యేక సెల్‌
మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి పీపీపీ విధానం
ఎలక్ట్రానిక్‌, మాన్యుఫాక్చరింగ్‌పై ప్రత్యేక దృష్టి
మొబైల్‌ తయారీ పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం
రంగాలవారీగా కేటాయింపులివే..

జల్‌జీవన్‌ మిషన్‌కు రూ 11,500 కోట్లు
విద్యారంగానికి రూ 99.300 కోట్లు
నైపుణ్యాభివృద్ధికి రూ 3,000 కోట్లు
కొత్తగా ఐదు స్మార్ట్‌ సిటీల అభివృద్ధి
నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌ ఏర్పాటుకు రూ1480 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ 27,300 కోట్లు
చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్‌ పథకం
త్వరలో జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీ
రవాణా మౌలిక సదుపాయాలకు రూ 1.7 లక్షల కోట్లు
చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్‌ పథకం
త్వరలో జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీ
2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే పూర్తి

పెద్దసంఖ్యలో తేజాస్‌ తరహా రైళ్లు, సెమీ హైస్పీడ్‌ రైళ్లు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top