మిలీనియం టవర్స్‌లో సచివాలయానికి మేం అభ్యంతరం చెప్పలేదు

విశాఖకు పరిపాలనా రాజధాని వస్తున్న సందర్భంగా మిలీనియం టవర్స్‌లో సచివాలయం (సెక్రటేరియట్‌) ఏర్పాటు విషయమై ఇండియన్‌ నేవీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఓ మీడియా లో వచ్చిన అంశాలను శనివారం రాత్రి నేవీ ఖండించింది. అలాంటి అభ్యంతరాలు, ప్రతిపాదనలు ఎపి ప్రభుత్వానికి తాము ఇవ్వలేదని స్పష్టం చేసింది.


మిలీనియం టవర్స్‌లో పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వానికి నేవీ నుంచి అభ్యంతరాలున్నట్లు మీడియాలో వచ్చిన కథనంలో నిజం లేదని నేవీ అధికారులు పేర్కొన్నారు. మిలీనియం టవర్స్‌లో రాజధాని, సిఎం క్యాంప్‌ కార్యాలయం రావడం వల్ల ఈ ప్రాంతంలో భద్రత పెరుగుతుంది మినహా అభద్రత రాదని చెబుతున్నారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top