మెంతులను ఇలా వాడితే షుగర్ ఇట్టే పోతుంది

వంటల్లో ఉపయోగించే ఎన్నో పదార్థాలలో అద్భుత గుణాలు దాగి ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టే మన పూర్వీకులు అనేక ఔషధాలలోనూ వీటిని ఉపయోగించి లాభాలు పొందారు. ఈ నేపథ్యంలోనే మెంతులను ఉపయోగించి ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చో తెలుసుకుందాం. 

మెంతుల్లో ఉన్న పోషక పదార్థాలు:

మెంతుల్లో ఎన్నో పోషకాలు, పీచు పదార్థాలు, ఇనుము, విటమిన్ సి, బి1, బి2 వంటి ఎన్నో ఆరోగ్యానకి సంబంధించిన పదార్థాలు ఉన్నాయి. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకి ఔషధంగా పనిచేస్తాయి.

అధిక బరువుతో బాధపడే వారు:

చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు మెంతులను పెరుగులో రాత్రి నానబెట్టి ఉదయాన్నే తాగడం వల్ల ఒంట్లోని అధిక కొవ్వు కరిగిపోతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం కూడా దూరం అవుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఇలా చేస్తుండాలని చెబుతున్నారు నిపుణులు

షుగర్ వ్యాధికి మందు గా....

చాలా మందికి అనేక కారణాల వల్ల డయాబెటీస్ దాడి చేస్తుంది. అలాంటి వారు మెంతులను ఉపయోగించి సమస్యను తగ్గించుకోవచ్చు. అందుకోసం మెంతులను నానబెట్టి ఆ నీటిని తాగుతుండాలి

డెలీవరీ అయిన అనంతరం కొంతమంది మహిళలకి పాలు సరిగ్గా రావు. దీంతో వారికి పుట్టిన పిల్లలకి పాలు పట్టడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారు మెంతులను వాడడం వల్ల బాలింతలకు పాలు బాగా పడతాయి. ఇందుకోసం మెంతులతో కషాయం తాగినా ప్రయోజనం ఉంటుంది. లేదా.. మెంతికూర రోజూ తీసుకున్నా పాలు బాగా పడతాయి. అదే విధంగా మెంతి పిండి, గోధుమ పిండులను సమానపరిమాణంలో నెయ్యిలో ఫ్రై చేసి దానికి సరిపడా పరిమాణంలో పంచదార కలిపి హల్వా చేసి తిన్నా సమస్య త్వరగా తగ్గిపోతుంది.

అదే విధంగా చాలా మందికి అనేక కారణాల వల్ల జుట్టు ఊడిపోతుందని బాధపడుతుంటారు. మెంతి ప్యాక్ వేసుకోవడం వల్ల సమస్య త్వరగా తగ్గిపోతుంది. ఇందుకోసం ముందురోజు మెంతులను పెరుగు, మజ్జిగ లేదా నీటిలో నానబెట్టి మరుసటి రోజు దానిని మిక్సీలో పేస్టులా పట్టి దాంతో ప్యాక్ వేయండి. దీని వల్ల సమస్య త్వరగా తగ్గిపోతుంది

చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో మొటిమలు ఒకటి. ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంత త్వరగా ప్రభావం కనిపించదు. అలాంటి వారు మెంతి ఆకులను పేస్టు చేసి ముఖానికి ప్యాక్‌లా వేసి ఆరిన తర్వాత నీటితో కడగాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే సమస్య చాలా వరకూ తగ్గుతుంది. ముఖంపై మచ్చలు కూడా తగ్గుతుంది. అలా కాకుండా మెంతులను పెరుగులో నానబెట్టి వాటిని పేస్టులా చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని ఆరిన తర్వాత చల్లని నీటితో క్లీన్ చేసినా సమస్య చాలా వరకూ తగ్గుతుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Income Tax Details and SoftwareCheck Jagananna Ammavodi Payment StatusSubscribe My Whatsapp & Telegram Groups YSR రైతు భరోసా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోగలరు More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top