3 నెలలు నో ఈఎంఐ.. ఏ ఏ లోన్స్‌కు, ఎవరెవరికి ఇది వర్తిస్తుంది? పూర్తి వివరాలు

3 నెలలు నో ఈఎంఐ.. ఏ ఏ లోన్స్‌కు, ఎవరెవరికి ఇది వర్తిస్తుంది? పూర్తి వివరాలు

కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కరోనా వైరస్ లాక్‌డౌన్ పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో రెపో రేటు తగ్గింపు, రుణ ఈఎంఐలపై 3 నెలల మారటోరియం వంటివి కూడా భాగమే. ఆర్‌బీఐ రేట్ల కోత వల్ల రుణాలపై వడ్డీ రేట్లు బాగా తగ్గే అవకాశం కూడా ఉంది. దీంతో ఇప్పుడు క్రెడిట్ కార్డు కలిగిన వారికి కొన్ని ప్రశ్నలు తలెత్తే అవకాశముంది. ఇంకా ఈఎంఐ కట్టకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బతినదా? అనే ప్రశ్నలు కూడా చాలా మందికి వచ్చే ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంద్దాం.

1.బ్యాంకులు అకౌంట్ నుంచి ఈఎంఐ డబ్బును కట్ చేసుకోవా? 

ఆర్‌బీఐ కేవలం మారటోరియం సదుపాయాన్ని మాత్రమే కల్పించాలని బ్యాంకులకు తెలియజేసింది. దీంతో బ్యాంకులు ఈఎంఐ డబ్బులను కట్ చేసుకోవాలా? లేదా? అనే అంశాన్ని కస్టమర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. అంటే మీకు బ్యాంక్ నుంచి మీకు ప్రత్యేకమైన అప్రూవల్ రాకపోతే మీ అకౌంట్ నుంచి ఈఎంఐ డబ్బులు కట్ అవుతాయి.

2,ఆర్‌బీఐ నిర్ణయంతో ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి? 

రిజర్వు బ్యాంక్ 3 నెలల మారటోరియం ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకులు ఈ అంశంపై చర్చిస్తాయి. బోర్డు స్థాయిలో ఈ అంశంపై చర్చలు జరుగుతాయి. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత బ్యాంకులు మీకు ఏ విషయాన్ని తెలియజేస్తాయి.

3.ఈఎంఐ కట్ కాకపోతే.. క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుందా? 

బ్యాంకులు మీ అకౌంట్ నుంచి ఈఎంఐ డబ్బులను కట్ చేసుకోకపోతే దాని వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. దీని గురించి మీకు ఆందోళన చెందాల్సిన అవసరం లేనేలేదు. నిశ్చింతగా ఉండొచ్చు.

4.ఏ ఏ బ్యాంక్ కస్టమర్ల ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు? 

ఆర్‌బీఐ ప్రకటన ప్రకారం.. అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, లోక్ ఏరియా బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు చెందిన కస్టమర్లు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. వీటి నుంచి కస్టమర్లకు ఈఎంఐ గురించిన సమాచారం వస్తుంది.

5.ఇప్పుడు ఈఎంఐ మినహాయింపా? లేదా వాయిదానా? 

ఈఎంఐ కట్టక్కర్లేదంటే కేవలం వాయిదా వేశారని అర్థం. 3 నెలల తర్వాత మళ్లీ ఈఎంఐలు కట్టాలి. మీ లోన్ టెన్యూర్ 3 నెలలు పెరుగుతుంది.

6.ఏ ఏ రుణాలకు మారటోరియం వర్తిస్తుంది? 

ఆర్‌బీఐ చాలా స్పష్టంగా తెలియజేసింది. టర్మ్ లోన్స్‌కు ఈ మారటోరియం వర్తిస్తుందని పేర్కొంది. అంటే హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్ వంటి వాటికి ఇది వర్తిస్తుంది. కన్సూమర్ డ్యూరబుల్ లోన్స్‌కు మారటోరియం ఉంటుంది. అంటే ఫ్రిజ్, స్మార్ట్‌ఫోన్, టీవీ వంటి వాటి కొనుగోలుకు రుణం తీసుకున్న వారు కూడా ఈఎంఐ కట్టక్కర్లేదు.

7.క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలా? లేదా? 

తొలిగా క్రెడిట్ కార్డులకు మారటోరియం వర్తిస్తుందా? లేదా? అనే అంశంపై అనిశ్చితి నెలకొంది. ఇవి టర్మ్ లోన్స్ కిందకు రావు. అయితే తర్వాత ఆర్‌బీఐ స్పష్టతనిచ్చింది. క్రెడిట్ కార్డు బకాయిలు కూడా ఈఎంఐ మారటోరియం కిందకు వస్తాయని తెలిపింది. దీంతో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మీ బ్యాంక్ నుంచి స్పష్టమైన సందేశాలు వస్తేనే చెల్లించకండి. లేదంటే బిల్లు కట్టేయండి. లేదంటే పెనాల్టీలు ఎదుర్కోవలసి వస్తుంది.

8.వ్యాపారానికి లోన్ తీసుకొని ఉంటే? 

ఆర్‌బీఐ బిజినెస్ లోన్స్‌కు సంబంధించి కూడా వివరణ ఇచ్చింది. అన్ని వర్కింగ్ క్యాపిటల్ లోన్స్‌కు వడ్డీ చెల్లింపుపై మారటోరియం ఫెసిలిటీ కల్పించింది. దీంతో బిజినెస్ లోన్ తీసుకున్న వారు వడ్డీ చెల్లింపులను 3 నెలల మారటోరియం తర్వాత కట్టేయవచ్చు.

Download RBI Guidelines
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

APSCERT Abhayasa Spoken English Course DD Saptagiri 10th Class Live ClassesSubscribe My Whatsapp & Telegram Groups Promotion Lists Software More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top