APSRTC ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిస్‌ల దరఖాస్తులు ఆహ్వానం

ఆర్‌టిసిలో ఐదు వేల మంది అప్రెంటిస్‌లకు అవకాశం కల్పించనున్నామని, అర్హులైనవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఎపి రోడ్డు రవాణా సంస్థ పేర్కొంది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. సంస్థ ఎమ్‌డి మాదిరెడ్డి ప్రతాప్‌ ఇటీవల జరిపిన డిపోల పర్యటనలో అప్రెంటిస్‌ల పనివిధానాన్ని గమనించి వారి సేవలు సంస్థకు మరింత అవసరమని గుర్తించారని పేర్కొంది.

అప్రెంటిస్‌షిప్‌ యాక్ట్‌ 1961 ప్రకారం వాస్తవ ఉద్యోగులలో 10 శాతం వరకు అప్రెంటిస్‌లను నియమించుకోవచ్చని, దానికి అనుగుణంగానే నియామకం చేపడుతున్నామని తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్థులు www.apprenticeship.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. మొత్తం ప్రక్రియ ఏప్రిల్‌ 15 లోగా పూర్తి చేయనున్నట్లు తెలిపింది.
ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న కంట్రిబ్యూషన్‌ రూ.1500తో పాటు సంస్థ కంట్రిబ్యూషన్‌ రూ.5431 చెల్లిస్తామని పేర్కొంది

Click Here to Apply
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top