జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

చాలామంది వయస్సు తక్కువ ఉన్నా తెల్లజుట్టు వచ్చేస్తుంటుంది. తెల్లజుట్టు నల్లగా వచ్చేందుకు కొందరు కొన్ని కెమెకిల్స్ వేసుకోవడం లాంటివి కొంతమంది చేస్తుంటారు. అయితే అలాంటివి వాడటం వల్ల అనారోగ్య సమస్యలు, ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే తెల్లజుట్టు తిరిగి నల్లవిగా కావడానికి ఎటువంటి చర్యలు ఉపయోగపడవంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఎక్కువ తెల్లవెంట్రుకలు రాకుండా అయితే జాగ్రత పడవచ్చుఅంటున్నారు.
ఉసిరి, హెన్నా పొడులు ఇందుకు ఉపకరిస్తాయని చెబుతున్నారు. రెండు కప్పుల నీళ్ళలో గుప్పెడు ఎండు ఉసిరి ముక్కలు నానబెట్టి మరుసటి రోజు నీటిని వడకట్టాలి. ఈ ముక్కల్లో హెన్నాపొడి, నిమ్మరసం, కాఫీ పొడి నాలుగేసి స్పూన్లు చొప్పున వేసి గ్రైండ్ చేయాలట.
అలాగే రెండు గుడ్లు, రెండు టీస్పూన్లు నూనె, అవసరమైన మేరకు ఉసిరి ముక్కలు వడకట్టిన నీరు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి కనీసం రెండు గంటలు ఆగి తలస్నానం చేయాలట. ఇలా చేస్తే మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top