స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల... ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ శనివారం విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. జడ్పీటీసీ, ఎంటీసీ ఎన్నికలు ఒక విడతలో నిర్వహించనున్నట్టు తెలిపారు. పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తామన్నారు. 660 జడ్పీటీసీ, 9639 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఒకే దశలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 21న జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను 24న ప్రకటిస్తారు. ఈ నెల 9నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇక ఈ నెల 23న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. ఈ నెల 27న తొలివిడుత పంచాయతీ ఎన్నికలు, 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని రమేష్‌ కుమార్‌ తెలిపారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

మార్చి 7: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 9-11: నామినేషన్ల స్వీకరణ
మార్చి 12: నామినేషన్ల పరిశీలన
మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 21: ఎన్నికల పోలింగ్‌
మార్చి 24: ఓట్ల లెక్కింపు

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌

మార్చి 9: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ
మార్చి 14: నామినేషన్ల పరిశీలన
మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 23: ఎన్నికల పోలింగ్‌
మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్‌

మార్చి 15: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 17-19: నామినేషన్ల స్వీకరణ
మార్చి 20: నామినేషన్ల పరిశీలన
మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 27: ఎన్నికల పోలింగ్‌
మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్‌

మార్చి 17: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 19-21: నామినేషన్ల స్వీకరణ
మార్చి 22: నామినేషన్ల పరిశీలన
మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 29: ఎన్నికల పోలింగ్‌
మార్చి 29: ఓట్ల లెక్కింపు

Download Schedule

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top