మేలు 'కలయిక. ట్విన్నింగ్‌ స్కూల్స్‌

 మేలు 'కలయిక'

♦️ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్ని అనుసంధానం చేస్తూ ‘కలయిక’ కార్యక్రమాన్ని రూపకల్పన.

♦️ విద్యార్థుల్లో పరస్పర జ్ఞానసముపార్జన, మేధోమథనం, భావ వ్యక్తీకరణ పెంపొందించటానికి పాఠశాలల కలయిక (ట్విన్నింగ్‌ స్కూల్స్‌) ఆలోచనకు రూపమిచ్చి ప్రత్యక్షీకరణ చేయనుంది.

♦️ గ్రామీణ ప్రాంత విద్యార్థులను నగర ప్రాంత పాఠశాలకు తీసుకెళ్లి అక్కడి విద్యార్థులతో మమేకం చేయాలన్నది ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం.

♦️ ప్రాథమిక స్థాయిలో 4, 5 తరగతుల్లో, ప్రాథమికోన్నతిలో 6, 7 తరగతుల్లో ఏదో ఒక తరగతిని ఎంచుకునే అవకాశం కల్పించారు.

♦️ ఏ గ్రూపు పాఠశాలల్లోని విద్యార్థులు బి గ్రూపులో పాఠశాలలకు వెళ్లి ఐదు రోజులుపాటు అక్కడి బోధన, విద్యా సంబంధ కార్యక్రమాలు, క్రీడలు, మధ్యాహ్న భోజన పథకాన్ని అంచనా వేస్తారు. తరువాత బీ గ్రూపులో పాఠశాలల విద్యార్థులు ఏ గ్రూపు పాఠశాలలకు వెళ్లి పరిస్థితిని అవగాహన చేసుకుంటారు.

♦️ ఒక పాఠశాల విద్యార్థులకు రవాణా భత్యం కింద రోజుకు రూ.200 వరకు ఖర్చు చేసే వెసులుబాటు కల్పించారు. ఒక్కో పాఠశాలకు వెయ్యి రూపాయల చొప్పున ఎమ్యీవో ఖాతాలకు ఎస్‌ఎస్‌ఏ జమ చేసింది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top