ఇంటికే మధ్యాహ్న భోజనం.!

 ఇంటికే మధ్యాహ్న భోజనం.!


★ కరోనా వ్యాప్తిని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు సైతం రద్దు చేసి విద్యార్థులకు తర్వాతి తరగతి ఉన్నతి కల్పించాయి.

★ కాగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ క్లిష్టకాలంలోనూ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెలవు రోజుల్లో విద్యార్థులు పౌష్టికాహారానికి దూరంగా ఉండకూడదన్న లక్ష్యంలో ఇప్పటికే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది.

★ ఈమేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలకు సూచించనుంది.

★ వండిన భోజనం నేరుగా ఇంటికి సరఫరా చేయడం లేదా విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకుఖాతాలో నగదు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరాలని నిర్ణయించింది.

★ అనుకోని పరిస్థితుల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తే విద్యార్థులకు చెందాల్సిన మధ్యాహ్న భోజనం అందించాలని నిబంధనల్లో ఉంది. అందుకే ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాం. ఏదేమైనా విద్యార్థులకు ప్రతిఫలం అందిస్తాం’ అని అధికారులు తెలిపారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top