ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని 15 మున్సిపల్ కార్పొరేషన్ లకు గాను 12 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్ తెలిపారు. కోర్టు స్టేల కారణంగా శ్రీకాకుళం, నెల్లూరు, రాజమండ్రి కార్పొరేషన్లకు ఎన్నికలు జరపడం లేదన్నారు.

ఇక 104 మున్సిపాలిటీల్లో 75 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు రమేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. కోర్టు వివాదాలు, పంచాయితీల విలీనంపై స్టే కారణంగా 16 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. మరోవైపు కొత్తగా ఏర్పడిన 12 మున్సిపాలిటీల్లో ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఎన్నికలు నిర్వహించడం లేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, నెల్లూరు, రాజమండ్రి కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు లేవు.

శ్రీకాకుళం జిల్లా: ఆముదాలవలస, రాజాం.ప.గోదావరి జిల్లా: భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకివీడు

కృష్ణా జిల్లా: గుడివాడ, జగ్గయ్యపేట, కొండపల్లి

గుంటూరు జిల్లా: బాపట్ల, మంగళగిరి, నరసారావుపేట, పొన్నూరు, తాడేపల్లి, గురజాల, దాచేపల్లి

ప్రకాశం జిల్లా: కందుకూరు, దర్శినెల్లూరు జిల్లా: గూడూరు, కావలి, బుచ్చిరెడ్డి పాలెం

చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తి, కుప్పం

కడప జిల్లా: రాజంపేట, కమలాపురం

కర్నూలు జిల్లా: బేతంచర్ల

అనంతపుర: పామిడి, పెనుకొండ

మార్చి 9: నోటిఫికేషన్‌ విడుదల

మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ

మార్చి 14: నామినేషన్ల పరిశీలన

మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది

మార్చి 23: ఎన్నికల పోలింగ్‌

మార్చి 27: ఓట్ల లెక్కింపు, ఫలితాలు
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top