Intermediate Examinations Know Your Seat and Know your Centre Locator Android App

ఆంధ్ర ప్రదేశ్ (AP) లో

ఈ నెల 4 వ తేదీ నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 9 గం.లకే  పరీక్షలు ప్రారంభమవుతాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు 8.30 గంటలకే చేరుకోవాలి.

ఈ సమయంలో ఏ విద్యార్థి అయిన లిఫ్ట్ కోసం చెయ్యెత్తితే మీ వాహనం నిలిపి  ఆ విద్యార్థికీ లిఫ్ట్ ఇచ్చి సహాయం చేయగలరు.

ఇంటర్మీడియట్ విద్యా మండలి వారు centre locater అనే App అందుబాటులో వుంచారు. ఆ App ద్వారా మీరు పరీక్ష రాసే కేంద్రాన్ని సులభంగా చేరుకోగలరు.

పరీక్ష కేంద్రంలో మీరు పరీక్ష రాయబోయే గది సంఖ్య మీరు ఏ వరుసలో కూర్చోవాలో కూడా BIE వెబ్ సైట్ లో ఇచ్చిన Option ద్వారా తెలుసుకోవచ్చును.

BiE వెబ్ సైట్ లో విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయడం ద్వారా  విద్యార్థి పరీక్షా కేంద్రం, పరీక్ష రాయబోయే గది నెంబర్ , వరుస క్రమం తెలుసు కోవచ్చును.

1.మీ అబ్బాయి లేదా అమ్మాయి ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ఈ పరీక్షల సమయంలో వారితోఎక్కువ సమయం కేటాయించాలి

2.పరీక్షకు వెళ్లేటప్పుడు నువ్వు చదివినవి అన్ని నీకు గుర్తు ఉంటాయి నువ్వు అన్ని రాయగలవు అని వారిని ప్రోత్సహించాలి.

3.ఈ పరీక్షల సమయంలో వారు సరిగా ఆహారం తీసుకునేలా సరిగా నిద్ర పోయేలా చూడాలి.
4.ఈ పరీక్షల సమయంలో  విద్యార్థులు ఒత్తిడికి గురి కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారు చెప్పే విషయాలను మీరు ఓపికగా వింటే విద్యార్థులలోపరీక్షలకు సంబంధించిన తెలియని ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంటుంది.

5.అయిపోయిన పరీక్ష గురించి డిస్కషన్స్ ( చర్చ) చేయవద్దు.

6. వాళ్లు పరీక్ష సరిగా రాయలేదని బాధపడితే వారిని కోపంగా మందలించకండి, తిరిగి మళ్లీ రాసుకోవచ్చు ని ధైర్యం చెప్పండి.

7. చదువు అనేది కేవలం మార్కుల కోసం ర్యాంకుల కోసం కాదని గుర్తుంచుకోండి.

8. గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర ఆధారంగా తేలింది ఏంటంటే పెద్దగా ర్యాంకులు సాధించలేని వారు కూడా సమాజానికి ఆదర్శ ప్రాయంగా ఎదిగినారు.

9. నీలో కూడా ఒక గొప్ప వ్యక్తి లక్షణాలు దాగి ఉన్నాయి.

10. పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే, పరీక్షలే జీవితం కాదు అని చెప్పాలి. చదువు కేవలం మార్కుల కోసం కాదని, జీవితంలో మార్పుల కోసమేనని వారిని ప్రోత్సహించాలి.
 అందరూ ఈ message విద్యార్థుల తల్లిదండ్రులకు చేరేవిధంగా  SHARE   చేయవలసినదిగా  కోరడమైనది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top