కొత్త ఆదాయ పన్ను పథకంపై క్లారిటీ

 ఏ పన్ను విధానం కావాలో ఉద్యోగులు చెప్పాలి

★ కొత్త పన్ను విధానం కావాలా వద్దా అన్న విషయాన్ని ఉద్యోగులు, తమ సంస్థల నిర్వాహకులకు తెలియచేయాలని ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. తద్వారా వేతనాల నుంచి టీడీఎస్‌ మినహాయించడానికి వీలు కల్పించాలని కోరుతోంది.

★ ఉద్యోగులు తమ ఎంపికను కంపెనీలకు తెలియజేయాల్సి ఉంటుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ఒక సర్క్యులర్‌లో పేర్కొంది.

పాత పన్ను విధానంలో...
★ రూ.2.5 లక్షల వరకు ఎటువంటి ఆదాయ పన్ను లేదు. రూ.2.5-5 లక్షలకు 5%; రూ.5-10 లక్షలపై 20%; రూ.10 లక్షల పైన 30 శాతం పన్ను విధిస్తారు.

కొత్త పన్ను విధానం(ఆప్షనల్‌) ప్రకారమైతే..
★ రూ.2.5-5 లక్షలపై 5%; రూ.5-7.5 లక్షలపై 10%; రూ.7.5-10 లక్షలపై 15%; రూ.10-12.5 లక్షలపై 20%; రూ.12.5-15 లక్షలపై 25%; రూ.15 లక్షలపైన 30 శాతం పన్ను వర్తిస్తుంది. అయితే పన్ను మినహాయింపులను వదులుకోవాల్సి ఉంటుంది


కొత్త ఆదాయ పన్ను పథకంపై క్లారిటీ Download Copy
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information


Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top