FREQUENTLY ASKED QUESTIONS : RBI Allowed Banks to Declare Moratorium on Term Loans

FREQUENTLY ASKED QUESTIONS : RBI Allowed Banks to Declare Moratorium on Term Loans



ఆర్‌బీఐ మారటోరియం

❖ ఆర్‌బీఐ మారటోరియం నేపథ్యంలో  సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌లో మూడు నెలల మారిటోరియంను లాక్‌ చేశామని, దీంతో ఆటోమేటిక్‌గా ఈఎంఐ నిలిచిపోతుంది.

❖ ఒకవేళ ఈఎంఐ కట్‌ అయితే* గనక ఆందోళన చెందవద్దు.సంబంధిత మొబైల్‌ సందేశాన్ని బ్యాంక్‌ శాఖకు మెయిల్‌ ద్వారా తెలియజేస్తే.. తిరిగి ఖాతాలో సొమ్ము జమ అవుతుంది.

 మీ EMI లు కట్ చేయోద్దా?


★ కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా RBI.... EMI ల చెల్లింపుల మీద మూడు నెలల మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.

★ మనదేశంలో చాలావరకు EMI లు ప్రతినెలా మొదటివారంలో ఆటోమేటిక్ గా కస్టమర్ బ్యాంక్ ఖాతా నుండి కట్ అవుతుంటాయి. కస్టమర్ లు  అందరూ ఈ  EMI లను దృష్టిలో ఉంచుకొని తమ ఖాతాల్లో నగదు నిల్వ ఉంచుకుంటారు.

★ అయితే, RBI మారటోరియం నేపథ్యంలో system software లో మూడు నెలల మారటోరియం ను lock చేశామని, దీనితో ఆటోమేటిక్ గా EMI నిలిచిపోతుందని SBI తెలిపింది. అంతేగాని... మారటోరియం అమలు చేయమని ప్రత్యేకంగా బ్యాంక్ కి లెటర్ పంపాల్సిన అవసరం లేదు.

★ ఒకవేళ EMI కట్ అయితే...(కట్ కాకూడదని మీరు అనుకుంటే )...  ఆందోళన పడాల్సిన పని లేదని...మీకు వచ్చిన  సదరు మినహాయింపు మొబైల్ సందేశాన్ని కస్టమర్ బ్యాంక్ శాఖ కు మెయిల్ చేసినా  లేదా స్వయంగా సంప్రదించినా .... తిరిగి మన ఖాతా లో ఆ సొమ్ము జమ కాగలదని SBI వెల్లడించింది.

ఒకవేళ EMI ల వాయిదా వద్దు అని ఎవరైనా అనుకుంటే
★ ఎవరైనా ఋణ ఖాతాదారులు మూడు నెలల మారటోరియం వద్దనుకుంటే మాత్రం... ఖాతాదారులే స్వయంగా కానీ లేదా మెయిల్ ద్వారా కానీ మాకు మారటోరియం వర్తింపజేయవద్దు అంటూ...  సంబంధిత బ్యాంక్ శాఖ ను సంప్రదించాలి.

★ ఉదా : బ్యాంకు ఖాతా SBI లో ఉండి ఋణం HDFC లో ఉన్న ప్పుడు.... ECS (Electronic clearing services) ద్వారా EMI కట్ అయ్యే సందర్భాలలో

★ బ్యాంక్ అకౌంట్ SBI లో ఉండి ... వాహన /గృహ /వ్యక్తిగత ఋణం HDFC లో ఉన్న సందర్భాలలో....

★ EMI లు  ECS ద్వారా కట్ అయ్యేది SBI లోనే కనుక......ఖాతాదారులు మారటోరియం ఆప్షన్ ను ఎంచుకోవాలనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా కానీ,  మెయిల్ ద్వారా కానీ సంబంధిత బ్యాంక్ శాఖ ను సంప్రదించాలి.

★ అంతేగాని, బ్యాంకే స్వయంగా ECS ను నిలుపుదల చేసే నిర్ణయాన్ని తీసుకోబోదు.

★ కొసమెరుపు : ఎవరైనా కస్టమర్లు మాకు మూడు నెలల మారటోరియం వద్దు... ఒక నెల చాలు  లేదా రెండు నెలలు చాలు.. అని అనుకున్నా సరే దానినే ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది...

 EMI చెల్లింపులపై బ్యాంకులు ఇస్తున్న ఆప్షన్లు ఇవే!


కెనరా బ్యాంకు- డిఫాల్ట్ ఆప్షన్ : డిమాండ్ పై మాత్రమే రిలీఫ్ ఉంటుంది. EMI చెల్లింపును నిలిపివేయాలంటే SMS ద్వారా 'NO' అని పంపాల్సి ఉంటుంది.

IDFC ఫస్ట్ బ్యాంకు : డిమాండ్ పై మాత్రమే రిలీఫ్ ఉంటుంది. - ఈమెయిల్ ద్వారా మారటోరియాన్ని కస్టమర్లు అడగవచ్చు.

PNB (పంజాబ్ నేషనల్ బ్యాంకు) :* ఆటోమాటిక్ గా రిలీఫ్ పొందవచ్చు..- ఒకవేళ చెల్లింపు కొనసాగించాలంటే బ్రాంచ్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

SBI : ఆటోమాటిక్ గా రిలీఫ్ పొందవచ్చు..- ఒకవేళ చెల్లింపు కొనసాగించాలంటే బ్రాంచ్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

HDFC :కస్టమర్ డిమాండ్‌పై మాత్రమే రిలీఫ్ పొందొచ్చు. - ఈమెయిల్ ద్వారా కస్టమర్లు బ్యాంకును అడగవచ్చు.

ICICI బ్యాంకు : కొన్ని లోన్లపై డిమాండ్ రిలీఫ్ మాత్రమే - ఈ విధానం ఎంపికల నిర్ణయంపై బ్యాంకులు పనిచేస్తున్నాయి.

IDBI బ్యాంకు :ఆటోమాటిక్ గా రిలీఫ్ పొందవచ్చు.- బ్యాంకు వెబ్ సైట్ లేదా ఈమెయిల్ ద్వారా కస్టమర్లు సంప్రదించవచ్చు.

Download Copy
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top