AAS - Automatic Advancement Scheme ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ (AAS)

AAS - Automatic    Advancement Scheme ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ (AAS)

        ప్రమోషన్ అవకాశాలు లేక ఒకే పోస్టులో ఎక్కువ కాలం పని చేయుచున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈ పథకం
GO.Ms.No. 117 Fin.Plg, Dt. 25.05.1981 ద్వారా Dt. 01.04.1981నుండి ప్రవేశ పెట్టబడింది.
     ఉపాధ్యాయులకు రీగ్రూపింగ్ స్కెల్ ఆధారంగా ఈ పథకం తేది. 01.12.1982 నుండి అమలు చేయబడింది. వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు
ప్రతి పీఆర్‌సీలో ఈ పథకానికి సంబంధించిన ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయబడుతుంటాయి. ప్రభుత్వఉద్యోగులకు విడుదల చేయబడే ఉత్తర్వులు, వివరణలు ఉపాధ్యాయులకు కూడా యధావిధిగా వర్తింప చేయబడుతుంటాయి.
ఇవికాక ఉపాధ్యాయులకు సంబంధించి కొన్ని ప్రత్యేక రాయితీలు (Exemptions) కూడా సాధించుకొనుట జరిగింది.

    జిఓ. ఎంఎస్.నం. 96 ఆర్థిక తేది. 20.05.2011 ద్వారా నూతన ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం 1.02.2010*
నుండి అమలులోకి వచ్చింది. ఈ పథకంలో నాలుగు రకాల స్నేళ్ళు ఉంటాయి.*
1.  Special Grade scale
2.  SPP-IA/SAPP-IA Scale
3.  SPP-IB/SAPP-IB Scale
4.SPP-II/SAPP-II Scale.

1. Special Grade Scale (SG):  ఉద్యోగి ఒక పోస్టులో 6 సం||ల ఇంక్రిమెంటల్ సర్వీసు పూర్తి చేస్తే వారికి ఈ స్కేలుమంజూరు చేయబడుతుంది. ఈ స్కేలు మంజూరుకు ఎటువంటి అదనపు అర్హతలు అవసరం లేదు. ఉద్యోగి పనిచేయుచున్న పోస్టుకు సంబంధించిన స్కేలుకు తదుపరి స్కేలు ఎస్క్ స్కేల్ గా మంజూరు చేయబడుతుంది. వేతన నిర్ణయం FR22a(i) read with FR31(2) ప్రకారం జరుగుతుంది.

2. A. Special Promotion Post Scale IA(SPP-IA)*: ఉద్యోగి ఒకే పోస్టులో 12 సం॥ల ఇంక్రిమెంటల్ సర్వీసు పూర్తిచేసినచో వారికి తదుపరి ప్రమోషన్ పోస్టు స్కేలు SPP-IA స్కేలుగా మంజూరు చేయబడుతుంది. ఈ స్కేలు పొందుటకు తదుపరి ప్రమోషన్ పోస్టుకు పూర్తి అర్హతలు కలిగి యుండవలెను మరియు ఆ పోస్టు సంబంధిత డిపార్ట్మెంట్ కు చెందిన సర్వీసురూల్సు ప్రకారం రెగ్యులర్ ప్రమోషన్ ఛానల్ లో యుండవలెను. ఉపాధ్యాయులకు ఈ స్కేలు పొందుటకు కొన్ని రాయితీలు యివ్వబడినవి. క్యాటగిరీ-2 ఉపాధ్యాయుడు 45 సం||లు నిండితే మొదట ప్రమోషన్‌కు 50 సం||లు నిండితే తదుపరి
ప్రమోషన్లు పొందుటకు డిపార్ట్ మెంటల్ పరీక్షలు (EO,GO Tests)నుండి మినహాయింపు కలదు. గ్రేడ్-1 పండితులు SOT పాస్ అయిన ఎడల ఈ స్కేలు వస్తుంది. మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు 45 సం||లు నిండినఎడల హెచ్ఎం ఎకౌంట్ టెస్ట్ నుండి మినహాయింపు కలదు. కేటగిరీ-3 వారు పిఏటి పరీక్ష పాస్ అయినచో ఈ స్కేలు పొందుటకు అర్హులు. వేతన నిర్ణయం FR 22a(i) read with FR 31(2) ప్రకారం జరుగుతుంది.

B. Special Adhoc Promotion Post IA(SAPP-IA)*:  *సర్వీసు నిబంధనల ప్రకారం తదుపరి ప్రమోషన్ ఛానల్ లేనివారికి 12 సం||ల ఇంక్రిమెంటల్ సర్వీసు పూర్తి అయిన ఎడల ఈ స్కేలు మంజూరు చేయబడుతుంది. దీనికి ప్రత్యేకమైన
అర్హతలు ఏమీ పొందనవసరం లేదు. 6నం||ల ఎజ్ స్కేలుకు తదుపరి స్కేలు SAPP-IA స్కేలుగా
మంజూరు చేయబడుతుంది. వేతన నిర్ణయం FR 22a(i) read with FR 31(2) ప్రకారం జరుగుతుంది.*

3. A. Special Promotion Post Scale IB (SPP-IB)*: *ఒక ఉద్యోగి ఒకే పోస్టులో 18 సం||ల ఇంక్రిమెంట్ సర్వీసు పూర్తిచేసిన ఎడల ఈ స్కేలు మంజూరు చేయబడుతుంది. సదరు ఉద్యోగికి SPP-IA స్కేలులోనే ఒక ఇంక్రిమెంటు మంజూరు
చేయ బడుతుంది. ఉద్యోగి నార్మల్ ఇంక్రిమెంట్ తేదీకే తదుపరి ఇంక్రిమెంటు మంజూరు చేయబడుతుంది. కొందరు ఉద్యోగులు 01.02.2010 నాటికి 24 సం||ల సర్వీసు పూర్తి చేసి అర్హతలు లేని కారణంగా SPP-II స్కేలు పొందలేకపోయినట్లయితే వారికి 18 సం||ల SPP-IB స్కేలు మంజూరు చేయబడుతుంది.

B. Special Adhoc Promotion Post Scale 1B* :  *SAPP-I స్కేలు పొందుతూ 18 సం||ల ఇంక్రిమెంటల్ సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగికి అదే స్కేలులో ఒక ఇంక్రిమెంటు మంజూరు చేయబడుతుంది. దీనికి ఎటువంటి అదనపు అర్హతలుఅవసరములేదు. నార్మల్ ఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది.

4. A. Special Promotion Post Scale II (SPP-I)* : *ఉద్యోగి ఒకే పోస్టులో 24 సం||ల ఇంక్రిమెంటల్ సర్వీసు పూర్తి చేసిన ఎడల రెండవ ప్రమోషన్ పోస్టు యొక్క స్కేలు SPP-II స్కేలుగా మంజూరు చేయబడుతుంది. ఈ స్కేలు పొందుటకు
రెండవ ప్రమోషన్ పోస్టు యొక్క అర్హతలు పూర్తిగా కలిగి యుండవలెను మరియు ఆ పోస్టు సర్వీసు నిబంధనల ప్రకారంరెగ్యులర్ ప్రమోషన్ ఛానల్ లో యుండవలెన. వేతన నిర్ణయం FR 22 a(i) read with FR 31 (2) ప్రకారం జరుగుతుంది.

B. Special Adhoe Promotion Post Scale II(SAPP-II)* : *ఉద్యోగి ఒకే పోస్టులో 24 సం||ల ఇంక్రిమెంటల్ సర్వీసు పూర్తిచేసిన సందర్భంలో సర్వీసు నిబంధనల ప్రకారం రెండవ ప్రమోషన్ పోస్టు యొక్క ఛానల్ లేనప్పుడు ఈ స్కేలు మంజూరు
చేయబడుతుంది. దీనికి ప్రత్యేకంగా అర్హతలు పొందవలసినవసరం లేదు. ఉద్యోగి అప్పటికి పొందుచున్న స్కేలుకు తదుపరిస్కేలు SAPP-II స్కేలుగా మంజూరు చేయబడుతుంది. వేతన నిర్ణయం FR22 a(i) read with FR31 (2) ప్రకారం జరుగుతుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top