జాతీయ వ‌ల‌స శ్రామికుల స‌మాచార వ్య‌వ‌స్థ ( నేష‌న‌ల్ మైగ్రెంట్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్, ఎన్ ఎం ఐ ఎస్‌) ను త‌యారు చేసిన ఎన్‌. డి. ఎం ఏ

జాతీయ వ‌ల‌స శ్రామికుల స‌మాచార వ్య‌వ‌స్థ ( నేష‌న‌ల్ మైగ్రెంట్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్, ఎన్ ఎం ఐ ఎస్‌) ను త‌యారు చేసిన ఎన్‌. డి. ఎం ఏ.
దేశ‌వ్యాప్తంగా ఒక రాష్ట్రాన్నించి మ‌రో రాష్ట్రానికి వ‌ల‌స శ్రామికులు వెళ్ల‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తించిన విష‌యం తెలిసిందే. వీరు త‌మ ప్ర‌యాణాన్ని బ‌స్సుల్లోను, ప్ర‌త్యేకంగా వేసిన శ్రామిక్‌రైళ్ల‌లోను త‌మ కొన‌‌సాగిస్తున్నారు.
వ‌ల‌స శ్రామికుల ప్ర‌యాణం సులువుగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన‌సాగేందుకు వీలుగా వారి వివ‌రాల‌తో కూడిన స‌మాచారాన్ని జాతీయ ప్ర‌కృతి విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ( నేష‌న‌ల్ డిసాస్ట‌ర్ మేనేజ్ మెంట్ అథారిటీ, ఎన్ డి ఎంఏ) సేక‌రించింది. ఎన్ ఎం ఐ ఎస్ పేరుతో డ్యాష్ బోర్డును రూపొందించి అందుబాటులోకి తెచ్చింది.
దీని ద్వారా ఆయా రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం వేగంగా జ‌రుగుతుంద‌ని కేంద్ర హోంశాఖ తెలిపింది. అంతే కాదు కోవిడ్ -19కు సంబంధించిన స‌మాచారం కూడా దీనిలో వుండ‌డంల్ల వీరికి చికిత్సాప‌ర‌మైన సాయం కూడా చేయ‌డానికి వీలు వుంటుంద‌.
శ్రామికుని పేరు, వ‌య‌సు‌, మొబైల్ నెంబ‌ర్‌, ఏ జిల్లాలో ప్ర‌యాణం మొద‌లుపెట్టాడు, ఏ జిల్లాల‌కు చేరుకోవాల‌నుకుంటున్నారు త‌దిత‌ర ప్ర‌యాణ వివ‌రాల‌ను ఇందులో ప్ర‌మాణీక‌ర‌ణ చేస్తున్నారు.
ఈ ఎన్ ఎంఐ ఎస్ స‌మాచారం ద్వారా ఎంత మంది రాష్ట్రంలో ఏ ప్రాంతాన్నించి త‌మ రాష్ట్రాల్లోని గ‌మ్య‌స్థానాల‌కు చేరుకుంటున్నారు అనేదాని మీద రాష్ట్రాలు ఒక అంచనాకు రాగ‌లుగుతాయి.
వ‌ల‌స శ్రామికుల మొబైల్ ఫోన్ల స‌మాచారం ఆధారంగా కోవిడ్ -19 ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌డం కూడా జ‌రుగుతుంద‌ని అధికారులు చెబుతున్నారు. 
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top