ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల కు గ్రాట్యుటీ, కుటుంబ పెన్షన్ సదుపాయాల వివరాలు

ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల కు గ్రాట్యుటీ, కుటుంబ పెన్షన్ సదుపాయాల వివరాలు:

★గ్రాట్యుటీ: CPS ఉద్యోగులకు డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ అమలుచేస్తూ GO MS NO.107 తేదీ 29.06.2017 న ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఉద్యోగి రిటైర్ అయినా లేక సర్వీస్ లో ఉంటూ మరణించినా గ్రాట్యుటీ కి అర్హుడు.

రిటైర్మెంట్ గ్రాట్యుటీ: చివరి వేతనం+DA కు 16.5 రెట్లు గరిష్ట పరిమితి తో 12 లక్షలు మించకుండా చెల్లించబడును.

★ఫ్యామిలీ పెన్షన్: CPS ఉద్యోగులకు సర్వీసు లో ఉండగా మరణిస్తే ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తూ GO MS No.121 తేదీ 18.07.2017 ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అయితే ఫ్యామిలీ పెన్షన్ కావాలనుకునేవారు కావాలనుకునేవారు వారి సిపిఎస్ ఖాతాలో నిల్వ ఉన్న మొత్తాన్ని ప్రభుత్వ పద్దుకు జమ చేయవలసి ఉంటుంది. ఫ్యామిలీ పెన్షన్ అవసరం లేని వారు సిపిఎస్ ఖాతాలో నిల్వ ఉన్న మొత్తాన్ని పొందవచ్చు.

★G.O.MS.No. 47, Dated: 20-04-2018 ప్రకారం ప్రభుత్వ CPS ఉద్యోగులకు ఇంవాలిడేట్/ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ సాంక్షన్ కొరకు AG ,ఆంధ్రప్రదేశ్ వారికి దరఖాస్తు చేయాలి. Class-IV మరియు తక్కువ వేతనం పొందే Police constables, Head constables, Excise constables & Forest guard వారికి ఆ జిల్లా లోకల్ ఫండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ కి చెందిన ఆడిట్ అధికారి అధీకృత అధికారి గా ఉంటారు.

★ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కోసం CPS ఖాతా నిల్వ మొత్తం ప్రభుత్వం కి జమ చేయాల్సిన పద్దు: 0071-01-101-06
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top