CFMS Phase-II HUMAN CAPITAL MANAGEMENT (CFMS PHASE II)

CFMS Phase-II HUMAN CAPITAL MANAGEMENT (CFMS PHASE II)

త్వరలోనే CFMS PHASE 2 రానుంది, ఈ CFMS PHASE - 2లో EMPLOYEE లాగిన్ నుండే PDF లోకి PAY SLIPS ను మరియు FORM16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఉద్యోగికి సంభందించి అన్ని వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు, ఆన్లైన్ లొనే CFMS సైట్ లొనే లీవ్ అప్లై చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్ లొనే వివిధ రకాల LOANS AND ADVANCES కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్ లొనే పెన్షన్ PROPOSALS పంపవచ్చును.

జీతాలు చెల్లింపు విధానంలో రానున్న మార్పులు

 రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలందించే విధానాన్ని మార్పు చేసింది . ఈ మార్పులను అన్ని ప్రభు త్వ శాఖల ఉద్యోగులకు అమలు చేసేందుకు నిర్ణయిం చింది . ఈ విధానాన్ని దశలవారీగా అమలు జరుపుతారు . - సీఎస్ఎంఎస్ రెండో దశను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది . మొదటి దశలో ఉన్న పొర పాట్లు , ఇతర ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టింది . " హ్యూమన్ క్యాపిటల్ మేనేజిమెంట్ ( హెచ్ సీఎం ) విధానాన్ని అన్ని ట్రెజరీ కార్యాలయాల్లో అమలు చేసేందుకు సదుపాయాలను సమకూర్చింది . - ఆర్ధిక శాఖ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీమా ( ఏపీజీఎల్ ) స్టేట్ ఆడిట్ , పే అండ్ అకౌంట్స్ విభాగాలలో ఈనెల నుంచే ఈ విధానంలో జీతాలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది » మిగిలిన శాఖల్లో కొత్త ఆర్థిక సంవత్సరంలో .. అంటే మార్చి తర్వాత అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది . » ట్రెజరీ కార్యాలయాలల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ విధానంలో జీతాలు అందించాక మిగిలిన ఇతర శాఖ లకు విస్తరిస్తారు . » ఉద్యోగుల సేవా పుస్తకాలను కంప్యూటరీకరించడం వల్ల అందులో ఉన్న వివరాలన్నీ ప్రభుత్వ వెబ్ సైట్లో కూడా ఉంటాయి . ప్రతినెలా వారికి రావాల్సిన పరిహా రాలు ఆటోమెటిక్ గా జనరేట్ అవుతుంటాయి . » తయారుచేసిన సాఫ్ట్వేర్ ఆధారంగా ఉద్యోగుల జీతాలే కాకుండా వారికి సంబంధించిన సమస్త ఆర్థిక వ్యవహరాలు అంటే ఇంక్రిమెంట్లు , ఎన్ క్యాష్ మెంట్ లీవులు వంటివన్నీ ఏ నెలకా నెల నమోదవుతుంటాయి . » ఉద్యోగులకు ప్రభుత్వం కేటాయించిన ట్రెజరీ ఐడీ ఈ ఎస్ఆర్‌కు అనుసంధానం చేయడం వల్ల ఈ నంబర్ ఆధారంగా నెలవారి జీతం అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే జీతం , డీఏ , హెల్తప్ , ఇతర కటింగ్లన్నీ కలిపి నిఖరఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా కార్యకలాపాలు జరుగుతాయి . తమకు ఇంక్రిమెంట్లు కావాలి , తమ జీతాలు పెంచాలని ఉద్యోగులు కోరుకునే పరిస్థితి ఉండదు . ప్రభుత్వం కరువు భత్యం పెంచిన తక్షణమే ఆ మొత్తం ఉద్యోగుల ఖాతాలలో జమ అవుతుంది . " ఇంతవరకు ట్రెజరీ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లను , ఏటీవోలను , ఇతర సిబ్బందిని ప్రసన్నం చేసుకునేందుకు ఉద్యోగులు నానాపాట్లు పడేవారు . ఇకపై ఆ పరిస్థితి ఉండదు . - అధికారులకు లంచాలు అందించే ప్రక్రియకు ఏమాత్రం అవకాశం ఉండదు . అదనపు ఎరియర్లు వచ్చినా ట్రెజరీ సిబ్బం దితో సంబంధం లేకుండా నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతా లలో జమ అవుతుంటాయి . - హెచ్ సీఎంలో ఎవరి ప్రమేయం లేకుండా ఉద్యోగులకు రావా ల్సిన ప్రయోజనాలన్నీ ఆటోమెటిగా నమోదవుతాయి . " ఉద్యోగుల జీతాల వ్యవహారంలో అవినీతి అక్రమాలకు తావులేకుండా నీతివంతమైన విధానం అమల్లోకి వస్తుంది . - ఈ ఎస్ఆర్ లో నమోదు చేసిన వివరాల మేరకు అన్ని కార్యక్ర మాలు పారదర్శకంగా అమలు జరిగే పరిస్థితి నెలకొంటుంది . లుబాటు జీతాల చెల్లింపులో వెసులుబాటు ఆర్ధిక శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల ఉద్యోగులు , ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులో ఎంతో వెసు ఉంటుందని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు . గతంలో మాదిరిగా ఉద్యోగులు ఇబ్బందిపడే పరిస్థి తి ఉండదు . అన్ని మండలాల ఉన్నత పాఠశాలల్లో ఉద్యోగులు , ఉపాధ్యాయులకు ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్లు అందుబాటులోకి వస్తే ఈ విధానం పని తీరు సులభతరమవుతుంది . అధికా రులు ఈ - ఎ లను తక్షణం చేపట్టే పనులను పూర్తిచేస్తే నూతన పద్ధతిలో ఉద్యోగులకు జీతాలు చెల్లించే అవకాశం క లుగుతుంది . చాలా మంచి విధానం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఉద్యోగుల జీతాల కోసం ప్రవే శపెడుతున్న హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్ మెంటు విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది . జీతాలను అందించడానికి ఉన్నత పాఠశాలల్లో గజిటెడ్ హెచ్ఎం డీడీవోగా వ్యవహరిస్తు న్నారు . ఈ విధానం అమల్లోకి వస్తే ఈ డీడీవోల ప్రమేయం లేకుండానే జీతాలు అందుతాయని పలువురు ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు . ప్రస్తుతం మూడు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు మాత్రమే ఈ విధానాన్ని ప్రవేశ పెట్టారు . అన్ని శాఖలకు కూడా తక్షణం అమలు చేయాలని పలువురు కోరుతున్నారు .

Download Copy

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top