పనితీరు ఆధారిత పాయింట్లు తొలగింపు

పనితీరు ఆధారిత  పాయింట్లు తొలగింపు

గత సంవత్సర కాలంగా బదిలీల కోసం ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ బదిలీలు మినహా మిగిలిన శాఖలో అందరికీ బదిలీలు నిర్వహించారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు నిర్వహించటం ఇబ్బందికరం అని  ప్రభుత్వం వేసవి సెలవులలో బదిలీలు నిర్వహిస్తామని ప్రభుత్వం వన్ తెలియజేసింది

ఉపాధ్యాయ బదిలీల్లో నిబంధనలు రూపొందిస్తున్న విద్యాశాఖ.

వాటిని సమీక్షించిన అనంతరం ప్రభుత్వానికి పంపనుంది. గతంలో పెట్టిన పనితీరు ఆధారిత పాయింట్లను తొలగించే అవకాశం ఉంది.

ఉపాధ్యాయులు పనిచేసే పాఠశాల ప్రాంతం, ఉపాధ్యాయుడి సర్వీసు ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు.

ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించేలా కసరత్తు చేస్తున్నారు.

జులై 15 తర్వాత బదిలీలు చేపట్టినా ఇందుకు సంబంధించిన కసరత్తు జూన్‌లోనే కొనసాగనుంది.
 రాష్ట్ర వ్యాప్తంగా 1.60లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు.

జూన్‌ 30 లేదా జులై 1ని కటాఫ్‌ తేదీగా తీసుకుని సర్వీసు లెక్కించే అవకాశం ఉంది.

 కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు.
మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

 ఆ తర్వాత ఖాళీల ఎంపికకు సమయం ఇస్తారు.

పాఠశాల ప్రాంతం..హెచ్‌ఆర్‌ఏ 20% కేటగిరి-1కు ఏడాదికి ఒక పాయింటు, హెచ్‌ఆర్‌ఏ 14.5% ఉండే వాటికి రెండు, హెచ్‌ఆర్‌ఏ 12% ఉండే వాటికి మూడు పాయింట్లు.

బస్సు సదుపాయం లేని ప్రాంతానికి 4పాయింట్లు.

ఆన్‌లైన్‌లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top