పాఠశాలలకు సప్త సూత్రాలు

 పాఠశాలలకు సప్త సూత్రాలు

★ కరోనా వైరస్‌ దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరంలో విద్యాసంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

★ అన్ని రకాల యాజమాన్యాలకు చెందిన పాఠశాలలకు ‘సప్త సూత్రా’లను అమలు చేయాలని సూచించింది.

★ ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే రెండు విడతలుగా తరగతులు నిర్వహించాలని తెలిపింది.

★ సాధారణ పరిస్థితులు వచ్చేంత వరకు మధ్యాహ్న భోజన పథకం కింద సరుకులు పంపిణీ చేయాలని సూచించింది.

 *మార్గదర్శక వివరాలు ఇలా ఉన్నాయి...*

*1. పాఠశాలల ఆవరణ :* పాఠశాల ఆవరణను క్రిమిసంహారకంగా శుద్ధి చేయాలి.   ప్రవేశ ద్వారం వద్ద విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలు పరిశీలించాలి. 30 మంది పిల్లలకు రెండు చొప్పున ఆటోమేటెడ్‌ చేతులు కడిగే యంత్రాలు ఏర్పాటు చేయాలి. వాషబుల్‌ క్లాత్‌ మాస్క్‌లను విద్యార్థులు, ఉపాధ్యాయులకు అందించాలి.

*2. స్కూలు నిర్వహణ సమయం :* పాఠశాల ఆవరణలో ఉదయం నిర్వహించే ప్రార్థన రద్దు. అయితే తరగతి గదిలో మైకుల ద్వారా చేయించుకోవచ్చు. 30 మంది విద్యార్థులకు మించి ఉంటే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రెండు విడతల్లో తరగతులు నిర్వహించాలి. ప్రతిరోజు 15 నిమిషాలు కొవిడ్‌-19 నివారణ చర్యలను వివరించాలి.

*3. విద్యార్థుల ఆరోగ్యం కోసం :* విటమిన్‌-ఏ కోసం రెగ్యులర్‌గా ఐరన్‌ మరియు ఫోలిక్‌ యాసిడ్‌ టాబ్లెట్లు కొనసాగించాలి. రెండు వారాలకోసారి శనివారం నాడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ఆటల పీరియడ్‌ను రద్దు చేయాలి. శనివారం ‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’ నిర్వహించాలి.

*4. మధ్యాహ్న భోజన పథకం :* సాధారణ పరిస్థితులు వచ్చే వరకు మధ్యాహ్న భోజన పథకం కింద సరుకులను అందించాలి.

*5. పరీక్షల ప్రొటోకాల్‌ :* పరీక్షా కేంద్రాల వద్ద శరీర ఉష్ణోగ్రతను పరిశీలించడం తప్పనిసరి. ఒక్కో గదిలో 10 మంది మాత్రమే పరీక్షలకు అనుమతించాలి.

*6. స్పాట్‌ వాల్యుయేషన్‌ సెంటర్లు :* మూల్యాంకన కేంద్రాలను జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయాలి. స్పాట్‌ కేంద్రాల్లో క్రిమిసంహారక మందులు స్ర్పే చేయాలి.

*7. లాక్‌డౌన్‌ సూచనలు :* స్కూలు పాయింట్‌ వద్దే విద్యార్థులందరికీ వర్క్‌ షీట్లు అందజేయాలి. టీవీల ద్వారా సూచనలకు సంబంధించిన వీడియోలను ప్రసారం చేయించాలి.  వారాంతపు అసైన్‌మెంట్లు నిర్వహించాలి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top