Staff Pattern Proposed Norms..for Rationlization

ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు మార్గదర్శకాలు:

▪️ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 60లోపు ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఇద్దరు ఉపాధ్యాయులను నియమించనున్నారు. 

▪️ఈ విద్యా సంవత్సరం నుంచి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండవు. 

▪️విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండేలా ప్రతిపాదనలను సిద్ధం చేసింది. 

▪️ఫిబ్రవరి 29వరకు ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. అనంతరం బదిలీలు చేపట్టనున్నారు.

సర్దుబాటు ఇలా చేస్తారు..

▪️విద్యార్థులు తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే అక్కడి పోస్టులను పిల్లలు అధికంగా ఉండే పాఠశాలకు బదిలీ చేస్తారు. 

▪️8 ఏళ్లు సర్వీసు పూర్తి చేసినవారికి బదిలీ తప్పనిసరి. ఆయా పాఠశాలల్లోని సీనియర్‌ ఉపాధ్యాయులు వద్దంటే జూనియర్‌కు అవకాశం కల్పిస్తారు. వీరికి అదనంగా పాయింట్లు కేటాయిస్తారు. 150 మంది విద్యార్థులు ఉంటేనే ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుడి పోస్టు ఉంటుంది. ఇంతకంటే తక్కువ ఉంటే ఎస్జీటీగా పరిగణించి పోస్టును సర్దుబాటు చేస్తారు.

▪️ప్రాథమిక పాఠశాలల్లో గతంలో 20లోపు విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉండగా.. ఇప్పుడు 60లోపు ఎంతమంది ఉన్నా ఇద్దరు ఉంటారు. రాష్ట్రంలో 7,774 ఏకోపాధ్యాయ పాఠశాలల్లో మరొకర్ని నియమించనున్నారు.

▪️ గతంలో 61-80 విద్యార్థులకు ముగ్గురు ఎస్జీటీలు ఉంటే ఇప్పుడు 61-90కి ముగ్గురు ఉంటారు.

▪️200 మంది విద్యార్థుల తర్వాత ప్రతి 40 మందికి అదనంగా ఎస్జీటీని నియమిస్తారు.

▪️ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6-7తరగతుల్లో 100మంది విద్యార్థులు ఉంటే నలుగురు సబ్జెక్టు ఉపాధ్యాయులు ఉంటారు.

▪️ 6-8 తరగతుల్లో 140మంది ఉంటే ఆరుగుర్ని కేటాయిస్తారు.

▪️ ఉన్నత పాఠశాలల్లో 240 మంది విద్యార్థులకు 9మంది ఉపాధ్యాయులను నియమిస్తారు.

▪️ 1200-1240 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రతి 40 మందికి ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టును మంజూరు చేస్తారు.

▪️441-480మంది విద్యార్థులు ఉన్నచోట్ల క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌, మ్యూజిక్‌ ఉపాధ్యాయుడిని కేటాయిస్తారు.

New Rationalisation Norms _ 2020  As per RTE Norms)   
                                  
         
PSలో 1-60 ఇద్దరు
                        
UPలో 1-100 నలుగురు (6th & 7th) 
                                                                     
UPలో 1-100 ఆరుగురు  (6th,7th & 8th)

6,7 తరగతుల UP పాఠశాలలకు తెలుగు,హిందీ,సోషల్,గణితం/PS ఉపాధ్యాయులు.(Roll upto 100)


8వ తరగతి కూడా ఉంటే అదనంగా ఆంగ్లం,BS ఉపాధ్యాయులు. (Roll upto 140)


ప్రతి ప్రాధమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు (Roll up to 60)

తదుపరి ప్రతి 30మందికి ఒక ఉపాధ్యాయుడు అదనం

PSHMలు కనీసం 151 రోలు ఉన్న పాఠశాలలకు మంజూరు


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top