APGLI WEBSITE New Look Online

APGLI WEBSITE రూపు మారింది.


కొత్తగా CFMS ID ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అయ్యే ఆప్షన్ ఇచ్చారు.ఆన్లైన్ ద్వారానే కొత్త అప్లికేషన్లు,ENCHANCEMENT అప్లికేషన్ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు.
గమనించగలరు

ఏపీ జి ఎల్ ఐ సైట్ కొత్త పుంతలు తొక్కుతోంది

ఇదివరకు ఉన్న APGLI సైట్  క్లోజ్ చేయడం జరిగింది. మరో కొత్త లింకు http://www.apgli.ap.gov.in/ ను ఇవ్వడం జరిగింది. చూడముచ్చటగా రూపుదిద్దుకున్నది.

 ప్రస్తుతానికి మనం పాలసీ యాన్యువల్ స్టేట్మెంట్లు గాని, బాండ్లు గాని డౌన్లోడ్ చేసుకోవడానికి  అవకాశమున్నా కొద్ది సమయం తీసుకునేటట్టుగా ఉన్నది. కారణం ఇదివరకైతే యాన్యువల్ అకౌంట్ slip గానీ బాండు కోసం గాని ఎపిజిఎల్ఐ లింక్ లో కి వెళ్ళినప్పుడు మన ఎపిజిఎల్ఐ నెంబర్ ముందు L చేరుస్తూ సబ్మిట్ చేసే వాళ్ళం. కానీ ప్రస్తుతం ఆ L అక్షరం తీసివేస్తూ మిగతా ఏవైతే ఏడు అంకెలు ఉన్నవో వాటిని మాత్రమే మనం అక్కడ ఫీడ్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. మన ఏపీ జి ఎల్ ఐ నెంబరు మనకు కావలసిన బాండ్ యొక్క series (A/B/C/D/....) ఆ కోడ్ మాత్రమే ఇచ్చి సబ్మిట్ చేయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఈ విధంగా మనం చేయాలనుకుంటే మనం లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. లాగిన్ అవ్వాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవకాశం శాఖవారు కల్పించారు.

ఈ రిజిస్టర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినప్పుడు సెలెక్ట్ District అనే ఆప్షన్ ఉంటుంది దీని పైన క్లిక్ చేసినప్పుడు మనం మన జిల్లా ను సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇలా మన జిల్లా ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కేటాయించబడిన సి ఎఫ్ ఎం ఎస్ నెంబర్ ఐడి ని అక్కడ మనం టైప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎంటర్ బటన్ ని మనం ప్రెస్/క్లిక్ చేసిన వెంటనే మన ట్రెజరీ ఐడి నెంబరు మరియు మన యొక్క పేరు కూడా Display అవడం జరుగుతుంది. వీటి తర్వాత మన మొబైల్ నెంబర్ ను, దీని కింద ఈమెయిల్ ఐడి ఇచ్చుకునే అవకాశం కల్పించారు. ఈ లాగిన్ కోసము ఒక పాస్వర్డ్ను మనం అక్కడ ఇవ్వవలసి ఉన్నది.

 ఈ పాస్ వర్డ్ జిల్లా APGLI శాఖ వారు డిఫాల్ట్ గా ఏదైనా ఒక పాస్వర్డ్ ఇస్తారా? లేదా సొంతంగా INDIVIDUAL/PERSONAL పాస్వర్డ్ కి అవకాశం ఇస్తారా అనేది తెలియాల్సివుంది. ZPPF మాదిరిగా డిఫాల్ట్ పాస్వర్డ్ ఇచ్చినట్లయితే అది అందరి ఖాతాదారులకు ఒకే విధంగా పాస్వర్డ్ వుండడం జరుగుతుంది.  రిజిస్టర్ ప్రాసెస్ ఇంకా కార్యాచరణలోకి రాలేదు. దీనికోసం రెండు/మూడు రోజులలో ఈ కార్యక్రమం పూర్తి చేయవచ్చని సమాచారం._

పాలసీ బాండ్లు డౌన్లోడ్ చేసే క్రమంలో బాండ్ పూర్తిగా రెండు పేజీలు  ఆకర్షణీయమైన రంగులలో కనిపిస్తోన్నది. ప్రస్తుతం APGLI సైట్ UNDER MAINTAINANCE లో ఉన్నది.

www.apgli.ap.gov.in

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top