వేడి నీళ్లు త్రాగడం వల్ల కరోనా రాకుండా నివారించవచ్చా? ఉపయోగాలు ఏమిటి?

కరోనా ప్రారంభమైన దగ్గర నుండి చాలా మంది ముందస్తు జాగ్రత్తగా వేడి నీళ్లు త్రాగటం లేదా వేడి నీళ్లలో పసుపు వేసుకుని త్రాగటం చేస్తున్నారు ఈ వేడి నీళ్ల వల్ల కరోనా కట్టడి కలుగుతాయా ఇప్పుడు తెలుసుకుందాం........

▪️ వైద్యులు చెబుతున్నదేమంటే ఈ వేడినీరు వల్ల మంచే జరుగుతుందంటున్నారు.

▪️ గోరు వెచ్చగా ఉండాలి

▪️కరోనా వైరస్ వ్యాధిలో ప్రధానమైన లక్షణం జలుబు. కానీ.. ఈ జలుబు పెరిగితేనే అసలైన సమస్యలు మొదలవుతాయి. కాబట్టి.. సమస్యను మొదట్లోనే కంట్రోల్ చేసేందుకు గోరు వెచ్చని నీళ్లు ఉపయోగపడతాయని డాక్టర్లు అంటున్నారు.

▪️అయితే ఈ వేడినీళ్ల వల్లే కరోనా రాకుండా ఉంటుందని.. అలాగే కరోనా వచ్చినా పోతుందని మాత్రం భావించవద్దు..

▪️సాధారణమైన నీరు తాగే కన్నా కాస్త వెచ్చగా ఉన్న నీరు తాగడం వల్ల ఎలాంటి నష్టమూ లేదు.. అన్నీ లాభాలే..

▪️ఈ వేడి నీరు వల్ల జలుబు వల్ల వచ్చే తెమడ అంతా క్లియర్ అవుతుంది.

▪️అలాగే వేడి నీరు కారణంగా.. స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది.

▪️మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. అయితే వేడి నీళ్ల వల్ల కరోనా చచ్చిపోవడం మాత్రం ఉండదు. జలుబు, దగ్గు తరచూ వచ్చే వారికి కూడా వేడి నీళ్లు తాగడం మంచిది. హోం క్వారంటైన్‌లో ఉండేవారు తప్పకుండా ఈ వేడి నీరు తాగడం మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

రోజూ వేడినీటిని తాగడం వల్ల మీ నరమండలాన్ని శాంతిపచేసుకోవచ్చు. అదెలాగనుకొంటున్నారా? మీకెప్పుడైనా కండరాలు నొప్పిగా ఉన్నా.. ఒత్తిడిగా అనిపిస్తున్నా కాస్త వేన్నీళ్లు తాగితే చాలా ఫ్రీగా అనిపిస్తుంది

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top