కేరళలో ఇంటింటికీ భోజనం సరఫరా చేస్తున్నారని, ఇక్కడా అదే పద్ధతి అనుసరించాలి- MDM Union

 మధ్యాహ్న భోజనం

★ జూన్ 12 నుంచి ప్రారంభం కావాల్సిన పాఠశాలలు ఎప్పుడు నుంచి ప్రారంభిస్తారో తెలియడం లేదని, వంట కార్మికుల ద్వారా భోజనం వండించి పిల్లల ఇళ్లకు పంపించేలా చర్యలు తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ కోరింది.

★ ఈ మేరకు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూపరాణి గురువారం ప్రకటన విడుదల చేశారు.

★ కేరళలో ఇంటింటికీ భోజనం సరఫరా చేస్తున్నారని, ఇక్కడా అదే పద్ధతి అనుసరించాలని కోరారు.

★ విద్యా సంవత్సరం నష్టపోకుండా పంచాయతీ ఆఫీసులు, కమ్యూనిటీ కేంద్రాలు, ప్రభుత్వ బడుల్లో టివిల ద్వారా డిజిటల్ పద్దతిలో పాఠాలు బోధిస్తున్నారని పేర్కొన్నారు.

★ భోజన పథకం కార్మికులు ఏప్రిల్ నుంచి పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఏప్రిల్, మే, జూన్ నెలలో వేతనాలు ఇవ్వాలని కోరారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top