ప్రమోషన్ నకు దగ్గరలో ఉన్న వారు SGT కేడర్లో 24 సంవత్సరాల స్కేలు తీసుకోవటం లాభదాయకమా ? నష్టదాయకమా?

24 year scale గురించి తెలుసుకోండి

*ముఖ్యంగా SGT మిత్రులు దీనిపై సరైన అవగాహన లేకపోవడం వలన ఆర్థికంగా నష్టపోతున్నారు

*24 year స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ...

*ప్రమోషన్ ద్వారా రావలసిన రెండు ఇంక్రిమెంట్లు రావు. ఒక్క ఇంక్రిమెంటు మాత్రమే వస్తుంది

*మరియు తదుపరి కొత్త కేడర్ లో AAS అంటే 6-12-18 స్కేళ్ళు రావు

*ఎవరైనా మన SGT మిత్రులు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి

మరో ముఖ్య విషయం

*మనం 24 సంవత్సరాలు service పూర్తి చేసుకుని, డిపార్ట్మెంటల్ పరిక్షలు ఉత్తీర్ణత పొంది ఉంటే అప్పుడు కూడా మనకు 24 year scale తీసుకోవాలని నిర్బంధం ఏమీ లేదు

*మనం DDO కు 24 స్కేలు కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు. అది రెగ్యులర్ ఇంక్రిమెంటులాంటిది కాదు

ఒక ఉదాహరణ చూద్దాం

*A అనే వ్యక్తి 25 సంవత్సరాలు sgt గా పనిచేసి తధుపరి పదోన్నతి తీసుకున్నాడు అనుకుందాం

*A తన సర్వీసులో 24 స్కేలు తీసుకుంటే అప్పుడు ఒక్క ఇంక్రిమెంటు వచ్చింది. పదోన్నతి వచ్ఛినపుడు మరొక ఇంక్రిమెంటు వచ్చింది.

*మొత్తం రెండు ఇంక్రిమెంట్లు వచ్చాయి

*A కు ఇంకా 12 సంవత్సరాల సర్వీసు ఉంది. అతడు 6 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు పొందవలసిన రెండు ఇంక్రిమెంట్లు నష్టపోయాడు

*B అనే టీచరు కూడా A తో పాటు సర్వీసు లోకి వచ్చి అతడి లాగే 25 సంవత్సరాల తరువాత పదోన్నతి పొందాడు అనుకుందా

*B మాత్రం 24 సంవత్సరాల స్కేలు వద్దని అధికారులకు తెలిపి తీసుకోలేదు. అతడు పదోన్నతి వచ్చినపుడు 2 ఇంక్రిమెంట్లు పొందాడు. 6 , 12 సంవత్సరాలకు AAS కింద మరో రెండు ఇంక్రిమెంట్లు పొందాడు

*మొత్తం 4 ఇంక్రిమెంట్లు B పొందాడు

*కావున మిత్రులు సర్వీసు ఎక్కువ ఉన్నవారు సరిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top