PRAN ఆన్లైన్ ఎకౌంటు నందు ఇప్పుడు ఎవరికి వారే ఆధార్, మొబైల్,ఈమెయిల్, నామినేషన్ వివరాలు మార్చుకోవచ్చు...
1.ముందుగా https://cra-nsdl.com/CRA/ క్లిక్ చేసి USER ID: PRAN నెంబర్
పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ ఖాతాలోకి లాగిన్ అవ్వాలి...
2. అందులో DEMOGRAPHIC CHANGES అనే ఆప్షన్ ఉంటుంది.దాన్ని క్లిక్ చేయండి
3.దానిలో మొదటిది మొబైల్,ఇమెయిల్ అప్డేట్ కి సంబంధించినది. దాన్ని క్లిక్ చేసి అవి అప్డేట్ చేసుకోవచ్చు
4.దానిలో ఆఖరి అంశం UPDATE PERSONAL DETAILS ఉంటుంది. దానిపై క్లిక్ చేసి PAN కార్డ్ మరియు నామినేషన్ మార్పు చేసుకోవచ్చు.
5.నామినేషన్ మార్పు కోసం ఆధార్ ఎనేబుల్డ్ ఈ-సైన్ అడుగుతుంది.అంటే మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ కి పాస్వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తేనే ఆ ప్రక్రియ పూర్తి అవుతుంది.
6.ఈ ప్రక్రియ లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అప్పుడు MEO ద్వారా STO కార్యాలయంకి ఎస్2 ఫారం నింపి పంపుకోవాలి.
0 comments:
Post a Comment