Krishna-Guntur&East -west Teacher MLC constituency MLC vote ONLINE REGITRATION
కృష్ణ గుంటూరు మరియు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయులు తాజాగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్ఛు గత ఓటరు జాబితాలో పేరు ఉన్నా ప్రస్తుతం నమోదు చేసుకోవాల్సిందే. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా నమోదు షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదును అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల్లో, కళాశాలల్లో వరుసగా మూడేళ్ల సర్వీసు పూర్తి చేసినవారు నమోదు చేసుకోవచ్ఛు
ఆఖరు తేది నవంబర్ 6
గత ఓటర్ల జాబితాతో సంబంధం లేకుండా అందరు మరల నమోదు చేసుకోవాలి.
అర్హత:
1) హైస్కూల్ ఆపైస్థాయి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తదితర విద్యాసంస్థలలో 2020నవంబరు1 కన్నా ముందు 6సం.లలో కనీసం 3సం.లు పనిచేసివుండాలి.అనగా 2014 నవంబర్ 1 నుండి 2020 నవంబర్ 1 మధ్యకాలంలో 3సంవత్సరముల సర్వీసు ఉండాలి.
2)సంబంధిత ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లి నియోజకవర్గ ఓటరుగా నమోదు అయి ఉండాలి.
దరఖాస్తు: ఫారం 19 లో సమర్పించాలి. ఫారంతో పాటు ఫోటో, సర్వీస్ సర్టిఫికేట్ జతపరచాలి.
దరఖాస్తును ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో సమర్పించవచ్చు
షెడ్యూల్
ఓటర్ల నమోదు ప్రకటన జారీ : ఆక్టోబరు 1
నమోదు స్వీకరణ తొలి పునః ప్రకటన జారీ: *అక్టోబర్ 15
నమోదు స్వీకరణ మలి పునః ప్రకటన జారీ : *అక్టోబర్ 25
దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ: *నవంబరు 6
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ: *డిసెంబరు 1న
అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణకు గడువు డిసెంబరు 1 నుంచి 31వరకు
అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారం: *2021 జనవరి 12
*తుది ఓటర్ల జాబితా ప్రచురణ : *2021 జనవరి 18న
Apply through below Link.......
Application for aTeacher MLC Vote Enrollment
https://ceoaperolls.ap.gov.in/ap_mlc_2020/online/form19.aspx
0 comments:
Post a Comment