Re-apportion and The Andhra Pradesh Teachers (Regulation of Transfers) Guidelines, 2020- Clarifications Rc.13029 Dt:22.10.20

 Re-apportion and The Andhra Pradesh Teachers (Regulation of Transfers) Guidelines, 2020- Clarifications Rc.13029 Dt:22.10.20

Latest clarifications from DSE AP(Memo No.ESE02-13029/11/2020-EST 3-CSE, Dt.22.10.2020)


ఉపాధ్యాయుల రేషలైజేషన్ & బదిలీలపై  పలువురు DEO లు అడిగిన సందేహాలపై  DSE AP వారు ఇచ్చిన తాజా క్లారిఫికేషన్స్


శ్రీకాకుళం DEO గారు


1) A. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యానికి చెందిన 10 ఖాళీ LP(తెలుగు) పోస్ట్ లు DEO పూల్ లో కలవు. వానిని తిరిగి కేటాయించేందుకు జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య UP పాఠశాలలు లేవు. 

క్లారిఫికేషన్ : GO MS No. 91 , SE(ser II)Dept, తేది.17.12.2018 ప్రకారం అసలు పాఠశాలల్లో LP  పోస్టులే లేవు/ఉండవు


B. పైన పేర్కొనబడిన DEO పూల్ లో గల LP(తెలుగు) పోస్టులను SA(తెలుగు) అవసరత గల ఉన్నత పాఠశాలలకు కేటాయించవచ్చా? 

క్లారిఫికేషన్ : DEO పూల్ లో గల ఉపాధ్యాయులను GO MS No.53 , తేది.12.10.2020 లో పేర్కొనబడిన మార్గదర్శకాలననుసరించి సర్దుబాటు చేయగలరు


C.GO MS No.53 , తేది.12.10.2020 నందలి UP స్కూల్స్ స్టాఫ్ పాటర్న్ - టేబుల్ II B కి చెందిన 7 వ పాయింట్ ప్రకారం... DEO పూల్ లో గల LP లను అవసరత గల UP స్కూల్స్ (I-VIII) లో (రోల్ యొక్క అవరోహణ క్రమంలో) SGT పోస్ట్ కి against గా నియమించాలి. కానీ... అట్లు చేసినయెడల SGT పోస్ట్ లో SGT నే  కోరుకోవాలి అనే హక్కు ప్రశ్నార్థకం కాగలదు.అందువలన బదిలీలలో అట్టి SGT పోస్ట్ లను LP ల కోసం preserve చేయవచ్చునా? 

క్లారిఫికేషన్ : రోల్ యొక్క అవరోహణ క్రమంలో అవసరత గల UP స్కూల్స్ (I -VIII) లో SGT పోస్ట్ కు against గా LP ని కేటాయించాలి.


D.సర్ ప్లస్ గా గల ఖాళీ LFL HM పోస్ట్ లను..... SGT పోస్ట్ లు అవసరత ఉన్న ప్రాధమిక పాఠశాలకు  (రోల్ యొక్క అవరోహణ క్రమంలో) కేటాయించవచ్చా? 

క్లారిఫికేషన్ : అవును.. 150 కంటే తక్కువ రోల్ గల ప్రాధమిక పాఠశాలలకు మాత్రమే కేటాయించాలి


E.GO MS No.53 నందలి  ప్రైమరీ స్కూల్ స్టాఫ్ పాటర్న్ లోని 4 వ పాయింట్ ప్రకారం... ఏదైనా పాఠశాలలో LFL HM  పోస్ట్ సర్ ప్లస్ గా ఉండి , ఆ పోస్ట్ పనిచేయువారు తప్పనిసరి బదిలీ కాబడుతున్నచో.. అటువంటి LFL HM పోస్ట్ ను అవసరత గల ప్రాధమిక పాఠశాలలకు షిఫ్ట్ చేయవచ్చునా? 

క్లారిఫికేషన్ : అవును.. అది కూడా 150 కంటే తక్కువ రోల్ గల ప్రాధమిక పాఠశాలలకు మాత్రమే షిఫ్ట్ చేయవలెను


విజయనగరం DEO గారు


2. A BA(హిస్టరీ, ఎకనామిక్స్) మరియు స్పెషల్ తెలుగు ఒక అదనపు సబ్జెక్టు గా కలిగిఉన్న వారు 

     B Dr BRAOU ద్వారా తెలుగు లిటరేచర్ సర్టిఫికెట్  & B Ed (సోషల్  & తెలుగు) చదివిన వారు SA(తెలుగు) పోస్ట్ కు పదోన్నతికి అర్హులేనా? 

క్లారిఫికేషన్ : అవును (డిగ్రీ తప్పనిసరి).... GO MS No. 56, తేది. 16.10.2020 & proc Rc No.2237/Estt.IV/2017, తేది. 21.06.1019 నందలి మార్గదర్శకాలను అనుసరించగలరు


విశాఖపట్నం DEO గారు


3. డిగ్రీలో స్పెషల్ తెలుగు ఆప్షనల్ సబ్జెక్టుగా  & అదనపు సబ్జెక్టుగా చదివిన వారు SA(తెలుగు) పదోన్నతికి అర్హులేనా? 

క్లారిఫికేషన్ : పై క్లారిఫికేషన్ చూడగలరు

Download Proceedings Copy

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top