▪️ఏపీ అమరావతి జేఏసీ ప్రకటన
▪ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి గారిని కలిసిన నాయకులు
కరోనా వల్ల మార్చి, ఏప్రిల్ నెలలో పెండింగులో ఉంచిన జీతాల్లో సగం డిసెంబర్ ఒకటిన ప్రభుత్వం చెల్లిస్తోందని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వై వి రావు చెప్పారు. వీరు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణలను కలిసి ఈ విషయాలపై చర్చించారు వారి సమాచారం మేరకు నవంబరు జీతంతో పాటు కరోనా పెండింగు జీతాలు సగం చెల్లిస్తామని చెప్పారన్నారు.
పింఛనుదారులకు సంబంధించి మూడు పెండింగ్ డీఏల చెల్లింపు ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి ఆమోదం తెలిపిన వెంటనే ఉత్తర్వులు విడుదల చేస్తామని ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ స్పష్టం చేశారన్నారు.
విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/JOW15BAOxbkAIbBmzUCIhB


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment