ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తుల పరిశీలన ఏ విధంగా చేస్తారు?

ఉపాధ్యాయుల బదిలీల దరఖాస్తు ప్రక్రియ నిన్నటితో ముగిసింది దరఖాస్తుల పరిశీలన నేటి నుండి మండల విద్యాశాఖ అధికారులు మరియు డిప్యూటీ విద్యాశాఖ అధికారులు చేస్తారు. ఉపాధ్యాయులు  దరఖాస్తు చేసిన దరఖాస్తులను వీరి లాగిన్ లో పరిశీలిస్తారు వీరి లాగిన్ లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు కేవలం Approval, Resubmission, Reject ఆప్షన్లు మాత్రమే ఇచ్చారు.

★ ఉపాధ్యాయ బదిలీలకు దరఖాస్తు చేసుకోవటానికి సోమవారంతో గడువు ముగిసింది.


★ దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియటంతో పరిశీలన ముమ్మరంగా సాగుతోంది. 


★ ఈనెల 12 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 


★ సోమవారం లోపు ఉపాధ్యాయుల స్థాయిలో ఏమైనా మార్పు, చేర్పులు ఉంటే చేసుకునే అవకాశం కల్పించారు.


★ మంగళవారం నుంచి ఏదైనా మార్పు, చేర్పులు చేయాలంటే ఎంఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మాత్రమే అవకాశం ఉంది. 


★ వీరు దరఖాస్తులు పరిశీలించి, బాగుంటే యాక్సెప్టు కొడితే ఎంఈవో లాగిన్‌కు చేరుతుంది.


★ అక్కడ మరోసారి పరిశీలించి సబ్మిట్‌ కొడితే నేరుగా డీఈవో లాగిన్‌కు వెళుతుంది.


★ రీ సబ్మిట్‌ కొడితే అందులో వివరాలు తప్పులు ఉన్నాయని అర్థం. అది తిరిగి ఉపాధ్యాయుడి చరవాణికి సమాచారం అందుతుంది. 


★ వెంటనే వారు అప్రమత్తమై హెచ్‌ఎం, ఎంఈవోలను సంప్రదిస్తే వారు ఎంఈవో లాగిన్‌లోకి వెళ్లి తిరిగి వివరాలు సరిచేసుకునే అవకాశం ఉంటుంది. 


★ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించటంతో ఎంఈవో కార్యాలయాల్లో ఈప్రక్రియ చురుగ్గా సాగుతోంది. 

ఉపాధ్యాయ బదిలీలకు 74వేల దరఖాస్తులు:

 ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. ఈ నెల 12 నుంచి సోమవారం సాయంత్రం వరకు 74వేల మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. 

వీరిలో కచ్చితంగా బదిలీలు కావాల్సిన ఉపాధ్యాయులు 24వేల మంది ఉన్నారు. 

మిగిలిన 50వేల మంది రిక్వెస్ట్ బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు.



★ మెడికల్‌బోర్డు సర్టిఫికెట్ల పరిశీలన విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కిందిస్ధాయి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.


★ బదిలీల క్రతువు ముగిసే వరకు జిల్లా స్థాయిలో ఏమైనా అభ్యంతరాలు వస్తే వాటిని వెంటనే పరిష్కరించటానికి జిల్లాకు ఒకరు చొప్పున సీనియర్‌ అధికారులను పరిశీలకులుగా పంపారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top