EHS Website స్మార్ట్ హెల్త్ కార్డుల కోసం మన వివరాలు ఎలా సరి చేసుకోవాలి?

               ప్రభుత్వ ఉద్యోగులు,  పెన్షనర్లకు క్యూఆర్  కోడ్ తో  ఈహెచ్ఎస్  స్మార్ట్ హెల్త్ కార్డ్  జారీ చేయనున్నట్లు   డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ  డాక్టర్ ఎ. మల్లికార్జున, ఒక ప్రకటనలో తెలిపారు. స్మార్ట్ హెల్త్ కార్డ్ జారీ కోసం  వివరాలను ఈహేచెస్  పోర్టల్ లాగిన్ ద్వారా సరిచూసుకొని,  ఏడు రోజులలో మార్పులు చేసి  అప్డేట్ చెయ్యాలని సూచించారు. .  

         ఈహేచెస్ పోర్టల్ లో యూజర్ ఐడి పాస్వర్డ్ లతో లాగిన్ అయ్యాక, డౌన్ లోడ్   హెల్త్ కార్డ్స్ మీద క్లిక్ చేశాక  ఎడిట్ కార్డ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందని  దాని మీద క్లిక్ చేసి వివరాలను అప్డేట్ చేయాలన్నారు. ఉద్యోగస్తులు,  పెన్షనర్లు ఈ విషయాన్ని గమనించి మీ లాగిన్ సరిచూసుకొని అందులో మీ పేరు, జెండర్, చిరునామా, ఫోటో, ఆధార్ నెంబర్ మరియు ఫోన్ నెంబర్ సరిగా ఉన్నాయో లేదో గమనించి అక్కడ ఏదైనా తప్పులు ఉన్నచో సరిదిద్దుకోదానికి  ఏడు రోజులు గడువు ఉంటుందని . అప్డేట్  చెయ్యక పోతే ఉద్యోగస్తుల,  పెన్షనర్ల దరఖాస్తులో ఉన్న వివరాలు సరైనవే అని భావించి స్మార్ట్ హెల్త్ కార్డులో ఆ వివరాలు ప్రింట్ నమోదవుతాయన్నారు.  ఏదైనా సందేహాలు ఉంటె  టోల్ ఫ్రీ నెంబర్  104 లేదా  8333817469, 8333817406, 8333817414 లకు ఫోన్ చెయ్యాలని సూచించారు .  ap_ehf@ysraarogyasri.ap.gov.in, ap_c439@ysraarogyasri.ap.gov.in కి మెయిల్ చేయొచ్చన్నారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top