★ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి పథకం వర్తింప జేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. మీడియాతో ఆయన మాట్లాడారు.
★ ‘జనవరి 9న జగనన్న అమ్మఒడి రెండో విడత చెల్లింపులు.
★ అమ్మ ఒడి పొందేందుకు ఈనెల 10 నుంచి 20 వరకు విద్యార్థుల రిజిస్ట్రేషన్లు.
★ ఈ నెల 16-19 వరకు లబ్దిదారుల ప్రాథమిక జాబితా ప్రదర్శన.
★ ఈ నెల 20-24 వరకు జాబితాలో తప్పుల సవరణకు అవకాశం.
★ ఈ నెల 26 న అమ్మ ఒడి లబ్దిదారుల ఫైనల్ లిస్టు ప్రదర్శిస్తాం.
★ ఈనెల 31న జాబితాపై అన్ని జిల్లాల కలెక్టర్ల ఆమోదం.
★ పూర్తి పారదర్శకంగా అమ్మఒడి పథకం లబ్దిదారులను ఎంపిక చేస్తాం.
★ గతేడాది 43 లక్షల 54 వేల 600 మంది లబ్దిదారులకు అమ్మఒడి వర్తింప జేశాం.
★ గతేడాది అమ్మఒడి కింద రూ. 6336 కోట్లు పంపిణీ’ చేసినట్లు మంత్రి తెలిపారు.
0 comments:
Post a Comment