బ్యాంకు ద్వారా మీరు హోమ్ లోన్ తీసుకుంటున్నారా అయితే 2.67 లక్షలు సబ్సిడీ పొందండి పూర్తి వివరాలు మీకోసం....

 ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా పక్కా ఇల్లు లేని వారు వడ్డీ రాయితీ రుణం పొందే అవకాశం ఉంటుంది. దేశంలో 2022 సంవత్సరానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు పక్కా ఇళ్లలో ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. పక్కా ఇళ్లు లేని వాళ్లు ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

తక్కువ ఆదాయం ఉన్నవారు, ఆర్థికంగా వెనుకబడిన వారు, మధ్యతరగతి వారు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్రం మూడు లక్షల కంటే ఆదాయం తక్కువగా ఉంటే అర్థికంగా వెనుకబడిన వారిగా, 3 లక్షల నుంచి 6 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు తక్కువ ఆదాయం ఉన్నవారిగా, 6 లక్షల నుంచి 18 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు మధ్య తరగతి వారిగా పరిగణిస్తోంది.

 


బ్యాంకులో హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు లోన్ తీసుకునే సమయంలో ప్రభుత్వ సబ్సిడీకి సంబంధించిన దరఖాస్తు తీసుకోవాలి. సబ్సిడీకి మీరు అర్హులు అయితే ఆ సబ్సిడీ మొత్తం బ్యాంకుకు అందుతుంది. సమీపంలోని బ్యాంకును సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను  తెలుసుకోండి

6 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉంటే రూ.2.67 లక్షలు, 6 నుంచి 12 లక్షల మధ్య ఆదాయం ఉంటే రూ.2.35 లక్షలు, 18 లక్షల వరకు ఆదాయం ఉంటే రూ. 2.30 లక్షలు సబ్సిడీ కింద పొందవచ్చు. సబ్సిడీ పోను మిగిలిన రుణాన్ని ఈ.ఎం.ఐల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

https://pmaymis.gov.in/open/check_aadhar_existence.aspx?comp=b


విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/JKlNYuRWESv55KNAUFsN0T

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top