నాడు-నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చాలా ముఖ్యమైన సూచనలు

 నాడు-నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చాలా ముఖ్యమైన సూచనలు :

👉 02-03-2021 మరియు 03-03-2021 వరకు విజయనగరం జిల్లాలో నాడు-నేడు పాఠశాలల నిర్మాణపనుల పర్యవేక్షణ చేయుటకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వారు, డైరెక్టర్, ఇన్ఫరాష్టక్చర్ వారు, కమీషనర్, పాఠశాల విద్యాశాఖ వారు, రాష్ట్ర పథక సంచాలకులు వారు విచ్చేయుచున్నారు.

👉 ఇందుమూలంగా ప్రప్రధమంగా నాడు-నేడు మరియు ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది మరియు ఇతర మండలాల్లోని పాఠశాలల సిబ్బంది అందరూ... 

✅ పాఠశాలలకు సకాలములో హాజరవడం 

✅ అటిండెన్స్ ఆప్ లో నమోదు చేయడం..

✅ మధ్యాహ్న భోజన పథకం కి సంబంధించి IMMS APP లో ఇన్సపెక్షన్ ఫార్మేట్ అప్లోడింగ్ చేయడం అదేవిధంగా సచివాలయ విద్యా వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు మండల విద్యాశాఖాధికారులు కూడా ఇన్సపెక్షన్ ఫార్మేట్ అప్లోడింగ్ చేయుట

✅ శానిటేషన్ కి సంబంధించి ఆయాల నియామకం చేయుట... జాయింట్ బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించుట... మొత్తం ప్రక్రియ ను అంతా IMMS లో అప్లోడ్ చేయుట..

✅ పాఠశాలల్లో పిల్లల అందరికీ జగనన్న విద్యా కిట్ల పంపిణీ ను సరిచూసుకునుట.. మొదలకు పనులన్నీ సమీక్షించుకోవాలి. బాలబాలికలందరూ ఏకరూపు దుస్తుల్లో.. షూసు ధరించి.. బ్యాగ్ లతో పాఠశాలకు హాజరయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. 


🔆🔆🔆🔆🔆🔆


 *ముఖ్యంగా నాడు-నేడు పనులకు సంబంధించి* 


🔆🔆🔆🔆🔆🔆

 *పరిపాలనాపరమైన అంశాలు* 


➕ సీఆర్పీలు 33% : 66% : 100% పనులు పూర్తి అయిన ఫొటోలు STMS APP లో అప్లోడ్ చేయాలి. 

➕ ప్రధానోపాధ్యాయులు మరియు ఫీల్డ్ ఇంజినీర్లు CPM బిల్లులు మరియు ఎక్సపండీచర్ అప్లోడింగ్ పూర్తి చేయుట.

➕ ప్రధానోపాధ్యాయులు మరియు ఫీల్డ్ ఇంజినీర్లు వర్క్స్ క్లోజ్ చేయవలెను.

➕ ఏ పాఠశాలలో అయితే పనులు పూర్తి అయ్యాయో ఆ పాఠాలల ప్రోజెక్టు క్లోజ్ చేయవలెను.

➕ ఏ పాఠశాలలో అయితే పనులు పూర్తి అయి ఇంకా వారి పిసి ఖాతాల్లో మిగులు నిధులు ఉన్నాయో మరియు ఏ పాఠశాలలకు ఖచ్చితంగా మరికొంత నిధులు అవసరమవతోయో గుర్తించి ఆ వివరాలను విద్యాశాఖ అధికారి వారికి అదనపు పథక సంచాలకుల వారి ద్వారా సమర్పించాలి.

➕ నాడు-నేడు నిర్మాణ పనులకు సంబంధించి ఏడు రకాల రికార్డులను అప్డేట్ చేసుకోవలెను.

✔️ బ్యాంకు లోని పిసి ఖాతాల్లో జమ అయిన నిధుల నుంచి ఖర్చులు మరియు చెల్లింపులు నిమిత్తం మీరు ఏ తేదీలలో డబ్బు విత్డ్రా చేసారో ఆదే వరుస క్రమంలో ఆ వినియోగించిన సొమ్ములకు సంబంధించిన బిల్లులు వరుసక్రమం లో సంసిద్ధంగా ఉంచుకోవలె.

✔️ వీటికి సంబంధించి తీర్మానాలు.. క్యాష్ బుక్ లో మరియు జనరల్ లెడ్జర్ లో ఎంట్రీ లు అన్నీ ఖచ్చితంగా పొంతన ఉండేలా సరిచూసుకోవాలి.

✔️ స్టాక్ రిజిస్టర్ ఎంట్రీలు... వాడినవి.. మిగిలినవి అన్నీ సరిపోవాలి.

✔️ అందరు నాడు-నేడు ప్రధానోపాధ్యాయులు నాలుగు ఫార్మేట్స్ నింపడం ప్రక్రియ పూర్తి చేసుకొని ఉండాలి.

🚫 ఒకవేళ గత్యంతరంలేని పరిస్థితుల్లో నాడు-నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎవరైనా సెలవుమీద వెళితే ఖచ్చితంగా నాడు-నేడు రికార్డులు మరియు బ్యాంక్ పాసుపుస్తకం తదుపరి ఇన్చార్జ్ కి అప్పచెప్పవలెను. 


 *నిర్మాణ పరమైన అంశాలు* 


🔴 ప్రప్రధమంగా పాఠశాల ప్రాంగణాలు చాలా పరిశుభ్రంగా ఉంచుకోవలె.

🔵 నేడు పనులు జరిగిన పాఠశాలల్లో ఇంకా పాత వస్తువులు.. మూటలు.. మొదలగునవి ఎక్కడా కనబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

🟠 చాలా పాఠశాలల్లో చిన్న చిన్న ముగింపులు అంటే గట్లు చివర ఫినిషింగ్స్.. టైల్స్ మరియు గ్రానైట్ ఫినిషింగ్స్.. సన్సైడ్స వద్ద ఫినిషింగ్స్.. పాఠశాల ప్రహారీ గోడల వద్ద చెత్త... తరగతి గదుల కిటీకల అవతల వేపు చెత్త... బోర్వెల్స్ వద్ద మురికి నీటి నిల్వలు.. అపరిశుభ్ర డ్రైనేజిలు.. ఎక్కడపెడితే అక్కడ పాత నిర్మాణాలను పడగొట్టిన రద్దు ఇలాంటివి గమనించడం జరిగినది కాబట్టి ఇవన్నీ ఎక్కడా కనబడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలె.

🟡 మరీ ముఖ్యంగా గ్రానైట్ లేదా టైల్స్ గచ్చులమీద సిమ్మెంట్ మాల్ పడి ఉండడం అవి బాగా పెచ్చుకట్టి గోకడానికి వీలులేనంతలా పడివుండడం గమనించడమైనది. వాటిని acid wash చేసి పరిశుభ్ర పరుచుకోవలె.

🟢 పాత్వే టైల్స్ వేసిన వాటి మీద ఇసుక జల్లి ఉంచారు. వాటిని శుభ్రపరచకపోవడం గమనించడమైనది.. ఆప్రదేశాన్ని శుభ్రపరుచుకోవలె.

🟣 ఇంకా ఏ పాఠశాలలోనైనా టాయిలెట్స్ లో ప్యాన్ లు ఫిక్స్ చేయకపోతే వాటిని తక్షణమే ఫిక్స్ చేయించడం మరియు బేసిన్స్ ను acid wash తో శుభ్రపరుచుకోవలెను.

🟤 ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు.. గ్రీన్ చాక్ బోర్డులు.. టీవీలు ఇంకా ఏ పాఠశాలలోనైనా instalచేయకపోతే తక్షణమే instal చేయించుకోవలె.

⚫ తరగతి గదుల్లోను మరియు టాయిలెట్స్ లోను విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయో లేదో చెక్ చేసుకుని ఒకవేళ వెలగకపోతే వెలిగేలా చర్యలు తీసుకోవాలి.

⚪ డ్రింకింగ్ వాటర్.. రన్నింగ్ వాటర్ వాడుకులో ఉండే విధంగా... టేపులు పనిచేసే విధంగా చర్యలు చేపట్టుట టాయిలెట్స్ లో బకెట్లు.. మగ్గులు ఏర్పాటు చేసుకొనుట.. ఫ్లష్ ట్యాంకు ల నుంచి నీరు వచ్చేటట్లు సరిచూసుకొనుట...

🔰ప్రతీ నాడు-నేడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖచ్చితంగా పాఠశాల నాడు-నేడు ప్రొఫైల్ షీటు మీ టేబుల్ పై ఉంచుకోవాలి. ఈ షీట్ లో మీకు సాంక్షన్ చేసిన అమౌంట్.. కాంపోనెంట్స్ వారీగా... మీకైన ఖర్చు.. మీరు చెల్లించిన మరియు చెల్లించాల్సిన CPM మొత్తాలు, ముగింపు అమౌంట్... 

మీ మండల విద్యాశాఖాధికారి పేరు, మీకు నిర్మాణ పనులు పర్యవేక్షించిన ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీల ఇఇ, డిఇ మరియు ఎఇ ల ఫోన్ నెంబర్లు.. మీ సీఆర్పీ నెంబరు మొదలగుయవాటితో ఓ ప్రొఫైల్ షీటు తయారు చేసి ఉంచుకోవాలి.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top